Konda Vishweshwar Reddy BJP
Konda Vishweshwar Reddy BJP : తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్ తగలనుందా? మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పుడీ వార్తలు బీజేపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వివేక్ దారిలోనే మరో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. శేరిలింగం పల్లి సీటు విషయంలో బీజేపీ-జనసేన మధ్య పంచాయితీ నడుస్తోంది.
Also Read : ఏపీలో చీకట్లు, సింగిల్ రోడ్లు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
పొత్తులో భాగంగా ఆ సీటును కనుక జనసేనకు కేటాయిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. శేరిలింగంపల్లి టికెట్ ను బీజేపీకి చెందిన రవి యాదవ్ కు కేటాయించాలని విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఒక్క శేరిలింగంపల్లిలోనే 30శాతం ఓట్లు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే ఈ నియోజకవర్గం కీలకం కానుంది.
Also Read : నాకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం : వివేక్
ఇప్పటికే బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వివేక్‌తో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు వివేక్. కేసీఆర్ కుటుంబం వారి ఆకాంక్షల మేరకే పని చేస్తోందన్నారు. కేసీఆర్‍ను గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. టిక్కెట్ కేటాయింపు తనకు అంత ముఖ్యమైన విషయం కాదని, బీఆర్ఎస్‌ను గద్దె దించడమే ముఖ్యమన్నారు.
బీఆర్ఎస్‌ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వివేక్ నమ్మారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వివేక్ చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.