High Temperatures: తెలంగాణలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతుంది.

High Temperatures: ఏప్రిల్ కూడా రానేలేదు దేశంలో ఎండా తీవ్రత అధికంగా ఉంది. భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ముంబై సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముంబై నగరంలో ఆదివారం నుంచి ఆరంజ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదు అవుతున్నా.. పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతుంది.

Also Read: KTR: మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించిన కేటీఆర్

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 6.1 డిగ్రీల అధికంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ లో 41.2 డిగ్రీలు, రామగుండం, భద్రాచలంలో 41 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 40.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. ఇక హైదరాబాద్ నగరంలో 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Also read: Bjp vs Trs: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మాట ఒక్కటే..!

ట్రెండింగ్ వార్తలు