Fire Accident : ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ సజీవ దహనం

ఇంట్లో మహిళ తప్ప కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మృతురాలి భర్త గ్రామంలో జరిగిన భజన కార్యక్రమానికి వెళ్లారు.

gas cylinder exploded

Fire Accident Woman Burnt Alive : నిర్మల్ జిల్లా భైంసా మండలం కమోల్ లో ఘెర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళ సజీవ దహనం అయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గుమ్మల ద్రుపద బాయి అనే మహిళ సజీవ దహనం అయ్యారు. ఇంట్లో మహిళ తప్ప కుటుంబ సభ్యులెవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మృతురాలి భర్త గ్రామంలో జరిగిన భజన కార్యక్రమానికి వెళ్లారు.

భర్త తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో మంటలు చెలరేగివున్నాయి. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. ఒక భారీ శబ్ధం వచ్చింది. సమీపంలో ఉన్నవారు తేరుకునే సరికే ఆ లోపే ఇల్లు, ఇంట్లో ఉన్న ద్రుపద బాయి అనే 52 ఏళ్ల మహిళ సజీవ దహనమైనట్లు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Today Gold Price : ఈ ఏడాది 13శాతం పెరిగిన గోల్డ్ ధర.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా?

గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగడంతోనే ఇల్లు దగ్ఢమై మహిళ సజీవ దహనమైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ప్రమాదమా? లేదా ఇతర కారణాలున్నాయా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.