Hyderabad : ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ వేళ విషాదం.. బాలింత మృతి.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

Hyderabad : ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Hyderabad

Hyderabad : ఐపీఎల్ – 2026‌లో భాగంగా గత ఆదివారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బాలింత మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.

Also Read : Golconda Party: హైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం.. ఆరుగురికి పాజిటివ్.. పార్టీలో బాలీవుడ్ నటులు?

నేపాల్ కు చెందిన సురేశ్ బిష్ణ (30) దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఘట్‌కేసర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి సాగర్ (6), సందీప్ (4), 26రోజుల పాప ఉన్నారు. బిష్ణ స్థానికంగా ఉన్న ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది. ఆదివారం సాయంత్రం సమయంలో ఆమె అనారోగ్యం పాలైంది. అకస్మాత్తుగా హార్ట్‌స్ట్రోక్ రావడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను అంబులెన్సులో నిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో ఉప్పల్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది.

ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో దాదాపు గంటన్నర పాటు అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. అదే సమయంలో ఎమర్జెన్సీలో ఉపయోగించే ఆక్సిజన్ కూడా పూర్తిగా అయిపోవడంతో బిష్ణకు శ్వాస అందక అంబులెన్సులోనే ప్రాణాలు కోల్పోయింది.

సకాలంలో అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకుంటే బిష్ణ ప్రాణాలతో బయటపడేది. కానీ, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ తో ఆమె ఆస్పత్రికి చేరుకోలేక పోవటంతో కన్నుమూసింది. దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుపోయినా అక్కడ డ్యూటీచేసే పోలీసులు స్పందించలేదని అంబులెన్స్ డ్రైవర్, మృతురాలు బంధువులు ఆరోపించారు.
బిష్ణ మరణంతో ముగ్గురు చిన్నారులు తల్లిలేని పిల్లులగా మిగిలిపోయారు.