Golconda Party: హైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం.. ఆరుగురికి పాజిటివ్.. పార్టీలో బాలీవుడ్ నటులు?
NDPS చట్టం సెక్షన్ 27(b) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రగ్స్ వినియోగదారుల కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు.
Golconda Party: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేగింది. గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ పై ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించింది. ఈగల్ ఫోర్స్, హెచ్ఎన్ఈడబ్ల్యూ, గోల్కొండ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ”More Than Friends” పేరుతో ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. దీనిపై ముందస్తు సమాచారం అందడంతో ఈగిల్ ఫోర్స్ రైడ్స్ చేసింది.
డ్రగ్స్ వినియోగంపై అనుమానంతో 35 మందికి పరీక్షలు చేయగా ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయ్యింది. ఐదుగురికి గంజాయి (THC) పాజిటివ్ నిర్ణారణ అయ్యింది. ఒకరికి AMP డ్రగ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నిందితులపై NDPS సెక్షన్ 27(b) కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగదారుల కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు. కాగా, ఈ డ్రగ్స్ పార్టీలో కొందరు బాలీవుడ్ నటులు పాల్గొన్నట్లు సమాచారం.
”ఓ ప్రైవేట్ సంస్థ ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించింది. డ్రగ్స్ పార్టీలో 35మంది పాల్గొన్నారు. అందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఐదుగురికి గంజాయి, ఒకరికి ఏఎంపీ డ్రగ్ పాజిటివ్ వచ్చింది. నిన్న అర్థరాత్రి గోల్కొండ పరిధిలో ఈగల్ టీమ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడింది” అని పోలీసులు వెల్లడించారు.
Also Read: సండే అని చికెన్ కొంటున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..
