Chicken Prices : సండే అని చికెన్ కొంటున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..
Chicken Prices : ఆదివారం వచ్చిందంటే చికెన్ ప్రియులకు పండుగే. ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో కిలో చికెన్ ధర రూ.400 వరకు పలికింది. ప్రస్తుతం మళ్లీ చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
chicken Price
- చికెన్ ప్రియులకు ఊరట
- ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తగ్గిన చికెన్ రేట్లు
- కిలో ధర రూ. రూ.250 నుంచి రూ.300
Chicken Prices : ఆదివారం వచ్చిందంటే చికెన్ ప్రియులకు పండుగే. ఎక్కువ మంది మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఆదివారం రోజున ఇంటిల్లి పాది ఒకచోట కూర్చొని చికెన్ కూరతో, చికెన్ వంటకాలతో భోజనం చేస్తుంటారు. దీంతో సండే వచ్చిదంటే చికెన్ షాపులు వద్ద పెద్దపెద్ద క్యూలు కనిపిస్తుంటాయి. అయితే, ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో కిలో చికెన్ ధర రూ.400 వరకు పలికింది. ప్రస్తుతం మళ్లీ చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలను పరిశీలిస్తే.. కేజీ చికెన్ రేటు రూ.230 నుంచి రూ.300 మధ్య ఉన్నాయి. వరంగల్లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280 నుంచి రూ.290 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో ప్రాంతాలను బట్టి చికెన్ ధరలు ఉన్నాయి. ఫాంరేటు రూ.140కాగా.. రిటైల్ ధర రూ.167గా ఉంది. కిలో డ్రెస్ట్ చికెన్ రూ.242 కాగా.. స్కిన్ లెస్ ధర రూ. 270గా ఉంది.
మరోవైపు.. ఏపీలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. విజయవాడలో కిలో చికెన్ రూ.230 నుంచి రూ. 250 మధ్యలో ఉండగా.. గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో కిలో చికెన్ రూ.300కు అమ్ముతున్నారు. పలు ప్రాంతాల్లో కిలో చికెన్ ధరలు రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి.
గత నెల రోజులుగా కోడి మాంసం ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు తగ్గిపోవటంతో మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించే పరిణామమని చెప్పొచ్చు.
