Vikarabad Incident: ‘మానవత్వం లోపించింది.. కఠినంగా శిక్షపడేలా చూస్తాం’

వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దుర్ఘటన పట్ల తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Vikarabad Incident: వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దుర్ఘటన పట్ల తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుద్ధభవన్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని ప్రకటించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. వీలైనంత త్వరగా దోషులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కమిషన్ కృషి చేస్తుందన్నారు.

ఈ మేరకు కమిషన్ కార్యాలయం సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ‘మైనర్ బాలికను దారుణంగా హత్య చేశారని, మనుషుల్లో మానవత్వం లోపించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నార’ని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సహకారంతో నిందితులను గుర్తించి శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దుండగుల బారీ నుంచి రక్షించుకోవడానికి బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్దతులు పాటించి ప్రాథమిక రక్షణ పొందాలని ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి సూచించారు.

Read Also: వికారాబాద్ జిల్లాలో దారుణం..!

ట్రెండింగ్ వార్తలు