×
Ad

ఫ్యూచర్‌ సిటీలో వరల్డ్ ట్రేడ్‌ సెంటర్, ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోలు, ఇంకా ఎన్నో.. 8న సమిట్‌లో కీరవాణి 90 నిమిషాల కచేరి

ఈ గ్లోబల్ సమిట్‌కు సినీ ప్రముఖులు కూడా రానున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆసక్తి చూపారు.

Future City: ఫ్యూచర్‌ సిటీలో ఏ రంగంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను తెలంగాణ సర్కారు ఆకర్షిస్తోంది. వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తోంది. దాదాపు 3 నెలల పాటు కసరస్తు చేసిన రూపొందించిన ఫ్యూచర్ సిటీ 4.0 ఫార్ములాను ప్రపంచం ముందు ఆవిష్కరించనుంది. డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ 2047కు అనేక మంది దిగ్గజాలు రానున్నారు.

అనేక పరిశ్రమల అధినేతలతో పాటు ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లను తెలంగాణ సర్కారు ఒకే వేదికపైకి తీసుకురానుంది. సదస్సుకు 4,800 మందికి ఆహ్వానాలు పంపింది. చాలా మంది ప్రముఖులు సదస్సుకు వచ్చేందుకు అంగీకరించారు. 2,000 వేల మందికిపైగా అతిథులు వస్తారని సర్కారు అంచనా వేస్తోంది. కాగా, ఫ్యూచర్‌ సిటీలో 70 ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్‌ సెంటర్ నిర్మించే ఛాన్స్ ఉంది.

Also Read: ఈ ఏడాది 53% పెరిగిన బంగారం ధర.. ఇక వచ్చే ఏడాదైతే.. ఇప్పుడుగనుక పసిడి కొంటే..

ఈ గ్లోబల్ సమిట్‌కు సినీ ప్రముఖులు కూడా రానున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆసక్తి చూపారు. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోలను ఏర్పాటు చేయాలని సల్మాన్ భావిస్తున్నారు.

ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అజయ్ దేవగణ్ కూడా అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి 90 నిమిషాల పాటు సంగీత కచేరి ఇవ్వనున్నారు.

గ్లోబల్‌ సమిట్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ఆవిష్కరిస్తుంది. సదస్సుకు గౌతమ్‌ అదానీ, అనంత్‌ అంబానీ, ఎరిక్‌ స్వైడర్‌ ఆనంద్‌ మహీంద్రా వంటి వారు కూడా వచ్చే అవకాశం ఉంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లోనే ప్రప్రథమంగా నెట్ జీరో కార్బన్ సిటీగా ఫ్యూచర్ సిటీని రూపుదిద్దనున్నారు.