Hyderabad : శివయ్య పిలుస్తున్నాడు అంటూ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి..!

Hyderabad : ఇంట్లో తల్లికి ఓ లేఖ కనిపించింది.. దానిలో ‘నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను.. దేవుడు శివయ్య పిలుస్తున్నాడు’ అని పేర్కొంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

young woman left home because she thought god was calling her

  • నన్ను శివయ్య పిలుస్తున్నాడు
  • ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి
  • పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు

Hyderabad : నన్ను శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్లిపోతున్నా.. అంటూ ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడిపల్లిలో జరిగింది. యువతి ఓ లేఖరాసి ఇంట్లో పెట్టి వదిలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్‌న్యూస్.. అవన్నీ ఇక మీ ఇంటికే..

పర్వతాపూర్ సాయిఐశ్వర్య కాలనీలో నివసించే బెల్లంకొండ శైలజ కుమార్తె మధు హసిత (19) ఇంటర్మీడియట్ పూర్తి‌చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. ఈనెల 27న సాయంత్రం తల్లి శైలజ ఇంటికి రాగా.. కుమార్తె కనిపించలేదు. ఇంట్లో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలో ఇంట్లో తల్లికి ఓ లేఖ కనిపించింది.. దానిలో ‘నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను.. దేవుడు శివయ్య పిలుస్తున్నాడు’ అని పేర్కొంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం వెతుకులాట ప్రారంభించారు.

గతంలో లాలాపేటలో నివాసం ఉంటున్న సమయంలో మధు హసితకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో గత పది నెలలుగా అతనితో మాట్లాడడం మానేసింది. అయితే కొద్దిరోజులుగా మధు హసిత ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఎక్కడికి వెళ్లిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.