Hyderabad : భయం లేదు, బాధ్యత లేదు.. రోడ్లపై బైక్ స్టంట్స్‌తో రెచ్చిపోతున్న ఆకతాయిలు

హైదరాబాద్ రోడ్లపై బైక్ స్టంట్లతో కుర్రాళ్లు హడలెత్తిస్తున్నారు. బైకులపై విన్యాసాలు చేస్తు భయపెడుతున్నారు. బైక్ విన్యాసాలపై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా..ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఆకతాయిలు మాత్రం ఆగటంలేదు.

bike stunts In Hyderabad :  హైదరాబాద్ రోడ్లపై బైక్ స్టంట్లతో కుర్రాళ్లు హడలెత్తిస్తున్నారు. బైకులపై విన్యాసాలు చేస్తూ భయపెడుతున్నారు. బైక్ విన్యాసాలపై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా, ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఆకతాయిలు మాత్రం ఆగటంలేదు. పటిష్టమైన భత్రత ఉండే సచివాలయం ఎదుటే బైకులపై విన్యాసాలు చేస్తు నానా రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావటానికి ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న స్టంట్లు వారికే కాదు తోటివారికి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి.

అర్థరాత్రి సమయంలో ఇటువంటివి చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు పట్టపగలే బైకులతో ఫీట్లు చేస్తు సినిమా హీరోల్లా ఫీల్ అయిపోతున్నారు. ట్రెండింగ్ కోసం జనాలను బెంబేలెత్తిస్తున్నారు. రోడ్లపై చేసే ఈ విన్యాసాలతో ప్రాణాల్ని రిస్కులో పెడుతున్నారు. ఓఆర్ఆర్, స్టీల్ బ్రిడ్స్ తో పాటు నగరంలోని అన్ని రోడ్లు తమదే అన్నంత ధీమాతో చేసే ఈ ఫీట్లు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి.

ఎంతో భద్రత ఉండే సచివాలయం వద్ద కూడా ఫీట్లు చేస్తున్నారంటే వారికి ఏమాత్రం బాధ్యతలేదని, ప్రాణాలంటే లెక్కలేదని అనుకునేలా ఉన్నాయి. వారి సరదాల కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటం కోసం వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టటమే కాకుండా కుటుంబ సభ్యులు తమపై పెట్టుకున్న ఆశల్ని కూడా పట్టించుకోవటంలేదని అనుకోవాలి.

ఎంతో కష్టపడి తమ పిల్లలకు తల్లిదండ్రులు బైకులు కొనిస్తుంటారు. కానీ కొంతమంది యువకులు మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా చేస్తున్న బైక్ స్టంట్ల వల్ల ప్రాణాలు పోతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా ఇటువంటి ఆగడాలు ఆగటంలేదు.. ఆకతాయిల విన్యాసాలకు అడ్డుకట్ట పడటంలేదు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఆకతాయిల బైక్ స్టంట్ల వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ జరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు