Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదు : YS షర్మిల

ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని..తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని..దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. అటువంటి కేసీర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ తీవ్రంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.

YS Sharmila criticizes CM KCR

Ambedkar Statue : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారకం ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్మించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యఅతిథిగా బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

బీఆర్ అంబేద్కర్ స్మారకం ఆవిష్కరణ జరుగనున్న తరుణంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. ఎన్నికలు దగ్గర వచ్చాక అంబేడ్కర్ విగ్రహం వచ్చిందని..
తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ విమర్శించారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన కేసీఆర్ కు దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదన్నారు షర్మిల. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఎందుకు మార్చాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. .కానీ తెలంగాణ యువతకు మాత్రం ఉద్యోగాల్లేవని ఎద్దేవా చేశారు.

విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని..కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేకుండా పోయాయని..కేసీఆర్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కొట్లాడే హక్కు లేకుండా చేశారని ఆరోపించారు.
దళితులను అన్ని రకాలుగా కేసీఆర్ మోసం చేరని..అటువంటి కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కులేదన్నారు.తెలంగాణ ఒక ఆఫ్గనిస్తాన్. కేసీఆర్ ఒక తాలిబాన్ నేత అంటూ అత్యంత ఘాటు విమర్శలు చేశారు షర్మిల. తెలంగాణలో అసలు రాజ్యాంగం ఉందా? అంటూ ప్రశ్నించారు.

ఇండియన్ రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేయాలని కానీ తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ అంబేడ్కర్ వారసుడు అని అంటున్నారు. దీనికంటే పెద్ద జోక్ లేదు అంటే ఎద్దేవా చేశారు. దళితులను జైల్లో చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. అన్ని పాలసీలకు దళితుల భూమి దోచుకుంటున్నారు ఇదేనా కేసీఆర్ కు దళితులపై ఉన్న ప్రేమ? అంటూ ప్రశ్నించారు.దళితులను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారని..అటువంటి కేసీర్ అంబేడ్కర్ వారసుడు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ తీవ్రంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.