YS Sharmila: సింగరేణి కార్మికులతో షర్మిల భేటీ

కాగా ‘సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల.. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతనని షర్మిల పేర్కొన్నారు.

Ys Sharmila

YS Sharmila: తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. జులై 8న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు.శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు షర్మిల. వైఎస్ అభిమానులు, షర్మిల పార్టీ నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

ఇక అక్కడే జిల్లా నేతలతో కొద్దిసేపు ముచ్చటించిన ఆమె అనంతరం సిరిసిల్లలోని డాక్టర్ పెంచలయ్య ఇంటికి వెళ్లారు. ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే చీరను షర్మిలకు బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురిని పరామర్శించనున్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను షర్మిల కలవనున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌లో మధ్యాహ్న భోజనం చేసి అనంతరం సింగరేణి కార్మికులను కలుస్తారు. వారి సమస్యలను తెలుసుకోనున్నారు షర్మిల.