YS Sharmila : కేసీఆర్ కు అసెంబ్లీ అంటే ఎందుకు భయం? ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము లేదా? : వైఎస్ షర్మిల
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు.
- bheemraj
- Published On : August 4, 2023 / 05:48 PM IST
YS Sharmila Reddy criticized KCR
YS Sharmila criticized KCR : సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖర్ రావు గారికి అసెంబ్లీ అంటే ఎందుకు భయం? ప్రజా సమస్యల మీద చర్చించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు. మూడొద్దులు అసెంబ్లీ పెట్టి, మీడియాలో మురిపించి తప్పించుకుందామనా? అని నిలదీశారు. ఎన్నికల ముందే గడీల్లోంచి బయటకు వచ్చిన దొర గారు.. అసెంబ్లీ సెషన్స్ లోనూ జనాలకు కనిపించడా? అని పేర్కొన్నారు.
ముమ్మాటికీ అసెంబ్లీ సమావేశాల గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రెండు దఫాల మేనిఫెస్టోపై, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చ జరగాలన్నారు. ‘మీ డబుల్ టర్మ్ కి ఇదే ఆఖరి సెషన్’ అని కేసీఆర్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ దొర నిజంగా తెలంగాణ ప్రజల మేలుకోరే వారే అయితే.. మీ పాలన మీద మీకు నమ్మకమే ఉంటే, ఈ ఆఖరి సెషన్ లోనైనా మేనిఫెస్టోపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని అన్నారు.
Rahul Gandhi: సుప్రీంలో ఊరట సరే.. ఇంతకీ రాహుల్ గాంధీ సభ్యత్వం ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది?
‘మీ పాలనకు ఇది రెఫరండమని నిరూపించుకోవాలి. నియంతలా పాలించడం, దోచుకోవడం తప్ప మీకేం చేతనైంది? ముమ్మాటికీ మీది బంధిపోట్ల రాష్ట్ర సమితి, తాలిబన్ల రాష్ట్ర సమితి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడు బయటకు రావడం కాదు.. తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీలకు కేటాయిస్తామన్న రూ.50వేల కోట్లు నిధులపై చర్చించాలని తెలిపారు.
Opposition Alliance I.N.D.I.A : విపక్షాల కూటమి I.N.D.I.Aపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ నోరు విప్పాలని చెప్పారు. అమరుల కుటుంబాలకు ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు. బంధిపోట్ల రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎన్నికల కుంభకర్ణుడు చంద్రశేఖరుడికి ఈ దమ్ముందా? అని సవాల్ చేశారు.
