Viral Video: కర్ణాటక మంత్రి వి.సోమన్న ఓ మహిళ చెంపపై కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమిపట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు భూమి పట్టా అందలేదని ఓ మహిళ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మహిళ తన వద్దకు వచ్చిన సమయంలో మంత్రి సోమన్న ఆమెను కొట్టాడు.
ఆ వెంటనే మంత్రి కాళ్లు పట్టుకుంది ఆ మహిళ. తనకు న్యాయం చేయాలని కోరింది. కర్ణాటక భూ రెవెన్యూ చట్టం 94సీ కింద భూములను క్రమబద్ధీకరించి 175 మందికి పట్టాలు ఇచ్చారు. అయితే, తనకు భూమి అందకపోవడంతో ఓ మహిళ ఆందోళనకు గురైంది. అధికారులను నిలదీస్తూ మంత్రి వద్దకు ఆమె వెళ్లగానే సోమన్న ఆమె చెంపచెళ్లుమనించారు. అనంతరం ఆమెకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.
K’taka BJP minister V Somanna @VSOMANNA_BJP slaps women who came to tell her grievance.
Is this how @BJP4India treats women ?
Somanna must resign #ResignSomanna #SackSomanna pic.twitter.com/EVPNpzKCY2
— Deepak (@Deepak_Ramaiah) October 23, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..