Viral Video: ద్విచక్ర వాహనంపై చిన్నారి ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించని వ్యక్తి.. చివరకు..

ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను వాహనాలపై తీసుకెళ్తున్నప్పునడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ చిన్నారిని స్కూటర్ లెగ్ ప్లేస్ వద్ద నిలబెట్టాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు.

Viral Video

Viral Video: ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను వాహనాలపై తీసుకెళ్తున్నప్పునడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ చిన్నారిని స్కూటర్ లెగ్ ప్లేస్ వద్ద నిలబెట్టాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు.

అంతేగాక, స్కూటర్ ఇంజన్ ను ఆఫ్ చేయకుండా ఆన్ లోనే ఉంచాడు. దీంతో ఒక్కసారిగా చిన్నారి స్కూటర్ యాక్సిలరేటర్ ను రేస్ చేశాడు. స్కూటర్ ముందుకు కదిలి పడిపోయింది. సీటుపై కూర్చున్న వ్యక్తి కిందపడిపోయాడు. ఆయన నడుముకు బలమైనగాయం తగిలింది. శ్వాసతీసుకోవడంలోనూ ఇబ్బందులు పడ్డాడు. వారి కుటుంబ సభ్యులు అందరూ కంగారు పడ్డారు.

చిన్నారి మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ‘రోడ్స్ ఆఫ్ ముంబై’ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులు వాహనాలపై ఉన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rs 1000 Notes: వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?