Video of dog
Video of dog: ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్ పై ఓ కుక్క దర్జాగా పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని రత్లాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘‘ఆసుపత్రుల్లో రోగులకు బెడ్లు దొరకడం లేదు. కానీ, కుక్కలు మాత్రం హాయిగా ఆసుపత్రి బెడ్లపై నిద్రపోతున్నాయి’’ అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఎద్దేవా చేశారు.
వైద్య వ్యవస్థ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆసుపత్రిలోకి కుక్క రావడమే కాకుండా అది బెడ్ పై పడుకోవడం పట్ల వైద్య సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రత్లాం చీఫ్ మెడికల్, హెల్త్ అధికారి డాక్టర్ ప్రభాకర్ నానావారె మాట్లాడుతూ… తాను సెలవుల్లో ఉన్నానని, కుక్క ఆసుపత్రి బెడ్ పై పడుకున్న ఘటన గురించి తనకేమీ తెలియదని చెప్పారు.
मध्यप्रदेश में भले मरीज़ों को बेड़ मिले या ना मिले लेकिन “श्वान “ तो बेड पर मस्त सोया हुआ है…
तस्वीर रतलाम के अलोट की बतायी जा रही है…
“बदहाल स्वास्थ्य सिस्टम” pic.twitter.com/mhqjdGNiEx
— Narendra Saluja (@NarendraSaluja) September 16, 2022
Rainfall alert for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం