Delhi : ఫ్లైఓవర్‌పై ఆగిఉన్న కారు.. అందులో మూడు మృతదేహాలు.. పోలీసుల ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే?
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన కలకలం రేపింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్లైఓవర్‌పై ఆగిఉన్న కారులో మూడు మృతదేహాలు లభ్యమయి..
- Harish Thanniru
- Updated on- February 9, 2026 / 11:53 AM IST
Delhi Police
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన కలకలం రేపింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్లైఓవర్‌పై కారు ఆగిఉంది.. అయితే, ఆ కారు చాలాసేపు కదలకుండా అక్కడే ఉంది. దీంతో స్థానికులు కారు వద్దకు వెళ్లి చూడాగా.. అందులో మూడు మృతదేహాలను కనుగొన్నారు.
Also Read : Toll Plaza : వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులకు ఇక చెక్.. కానీ, ఈ నిబంధనలు పాటించాలి..
కారు ప్లైఓవర్‌ఫై గంటల కొద్ది వేచిఉంది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి ఆ కారు వద్దకు వెళ్లి చూశారు. కారులో ముగ్గురు స్పృహకోల్పోయి పడి ఉన్నారు. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు అద్దాలు తొలగించి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. అప్పటికే వారు మరణించినట్లు గుర్తించారు. కాగా. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు కాలేదు. కారులోని వస్తువులు ఏవీ చోరీకి గురికాలేదని పోలీసులు గుర్తించారు. అయితే, వారు ఎలా మరణించారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను రణధీర్ (76), శివ నగేష్ సింగ్ (47), లక్ష్మి (40)గా గుర్తించారు.
కారులోని ముగ్గురు విషం తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు .. ఎవరైనా వారిని హత్యచేసి కారులో పడేసి ఉంటారా అనే అనుమానాలనుసైతం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మరణాల వెనుక కుటుంబ సభ్యులు ఉన్నారా..? లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
