Earthquake Strikes Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..బయటకు పరుగులు తీసిన జనం

ఫిలిప్పీన్స్ దేశంలో గురువారం ఉదయం 10 గంటలకు భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని నగరమైన మనీలాకు మూడు గంటల ప్రయాణ దూరంలో 124 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది....

Earthquake Strikes Philippines

Earthquake Strikes Philippines: ఫిలిప్పీన్స్ దేశంలో గురువారం ఉదయం 10 గంటలకు భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని నగరమైన మనీలాకు మూడు గంటల ప్రయాణ దూరంలో 124 కిలోమీటర్ల లోతులో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కలాటగాన్, మనీలా, హార్ట్ ల్యాండ్ పై ఈ భూకంపం ప్రభావం చూపించిందని మున్సిపల్ పోలీసు చీఫ్ ఎమిల్ మెండోజా చెప్పారు.

Cyclone Biparjoy sattilite Pics: ట్విట్టర్‌లో వెలుగుచూసిన బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత శాటిలైట్ చిత్రాలు

భూకంపంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనాకు విపత్తు అధికారులను నియమించామని మెండోజా పేర్కొన్నారు. భూకంపం 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు కొనసాగిందని కలాటగన్ విపత్తు అధికారి రోనాల్డ్ టోరెస్ తెలిపారు.భూకంపం కారణంగా రాజధానిలోని భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.భూకంప ప్రభావంపై అధికారులు అంచనా వేస్తున్నట్లు సివిల్ డిఫెన్స్ కార్యాలయ సమాచార అధికారి డిగో మారియానో ​​తెలిపారు.

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

జపాన్ నుంచి ఆగ్నేయాసియా ,పసిఫిక్ బేసిన్ ఫిలిప్పీన్స్ అంతటా రింగ్ ఆఫ్ ఫైర్ విస్తరించి ఉంది. 2013వ సంవత్సరం అక్టోబర్ నెలలో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని బోహోల్ ద్వీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా మరణించారు.భూకంపం వల్ల ఫిలిప్పీన్స్‌లోని కాథలిక్కుల జన్మస్థలంలోని పాత చర్చిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా దాదాపు 4లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పదివేల ఇళ్లు దెబ్బతిన్నాయి.