Heart Attacks : 81 ఏళ్ల వృద్ధురాలికి 6 రోజుల్లో 5సార్లు గుండెపోటు..బతికిబయటపడ్డ బామ్మను చూసి డాక్టర్లు సైతం షాక్

81 వృద్ధులకి కూడా గుండెపోటు వచ్చింది. అలా రోజుల్లో ఒకటీ రెండు సార్లు కాదు కేవలం ఆరు ఐదు సార్లు ఆమె గుండెపోటుకు గురి అయ్యింది. కానీ ఆ వృద్ధురాలు మాత్రం గుండెపోటును జయించింది. సురక్షితంగా ఆరురోజుల్లో ఐదుసార్లు వచ్చిన గుండెపోటులను ఎదుర్కొన్న ప్రాణాలతో బయటపడటం ఓ అద్భుతమంటున్నారు డాక్టర్లు.

81 Years Old Delhi Women survives 5 times cardiac arrests In six days

Heart Attacks :  ఇటీవల కాలంలో యువకులు కూడా గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్న ఘటనలో ఆందోళన కలిగిస్తోంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా గుండెపోటులకు గురి అవుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ఇటువంటి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈక్రమంలో ఢిల్లీకి చెందిన 81 వృద్ధులకి కూడా గుండెపోటు వచ్చింది. అలా రోజుల్లో ఒకటీ రెండు సార్లు కాదు కేవలం ఆరు ఐదు సార్లు ఆమె గుండెపోటుకు గురి అయ్యింది. కానీ ఆ వృద్ధురాలు మాత్రం గుండెపోటును జయించింది. సురక్షితంగా ఆరురోజుల్లో ఐదుసార్లు వచ్చిన గుండెపోటులను ఎదుర్కొన్న ప్రాణాలతో బయటపడింది. ఈ అద్భుతాన్ని చూసి డాక్టర్లే ​​షాక్ అవుతున్నారు. వైద్య విజ్ఞానరంగంలో ఇదో అద్భుతమంటున్నారు.

ఢిల్లీలో ఉంటున్న 81 ఏళ్ల వృద్ధురాలు గుండె సమస్యలతో బాధపడుతున్న ఆమె కుటుంబ సభ్యులు మాక్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె ఆసుపత్రికి వచ్చే సమయానకి ఊపిరి కూడా ఆడటంలేదు. దీనితో డాక్టర్లు వెంటనే చికిత్స కోసం. అలా ఆరురోజుల పాటు ఆమెను డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్న ఆముకు ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు గుండెపోటు వచ్చింది.

అలా గుండెపోటు వచ్చిన ప్రతీసారి ఆమెకు డాక్టర్లు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆటోమెటిక్ ఇమ్ ప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫైబ్రలేటర్ (AICD) పరికరాన్ని ఆమె ఛాతి భాగంలో అమర్చి చికిత్స చేశారు. అలా ఆమె ఆ గుండెపోట్ల నుంచి సురక్షితంగా బయటపడింది. 81 ఏళ్ల వయస్సులో ఆమె గుండెపోటులను జయించి ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం ఓ అద్భుతమంటూ ఆశ్చర్యపోతున్నారు డాక్టర్లు.

ఈ అరుదైన మహిళ గురించి మాక్స్ ఆసుపత్రిలోని కార్డియాలజీ ఛైర్మన్ అయిన డాక్టర్ బాల్బీర్ మాట్లాడుతూ వైద్య విజ్ఞాన రంగంలో ఇదో మిరాకిల్ సింగ్ అన్నారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు ఆరోగ్యంగా ఉన్నారని..ఎంత ఆరోగ్యంగా అంటూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేశామని.