Students Drop Out
Students Drop Out : దేశంలో విద్యార్థుల డ్రాపౌట్ సంఖ్య పెరుగుతోంది. చాలా మంది విద్యార్థులు అర్ధాంతరంగా చదువు మానేస్తున్నారు. స్కూల్స్ మొదలుకొని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఐదేండ్లలో దాదాపు 19వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. తాజాగా వీటికి సంబంధించిన గణాంకాలను స్వయంగా కేంద్రమే విడుదల చేసింది. డ్రాపౌట్ అయిన వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే కావటం ఆందోళన కలిగించే విషయం.
ఇదే క్రమంలో అనేక మంది విద్యార్థలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎదురవుతున్న కుల వివక్ష, విపరీతమైన ఒత్తిడి, కఠినమైన సిలబస్ వంటి కారణాలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయినా, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకోవటం లేదు.
Dalit IIT Student: ఐఐటీ బాంబేలో మరో రోహిత్ వేముల.. కుల వివక్ష దాడి భరించలేక విద్యార్థి ఆత్మహత్య
దీంతో సెంట్రల్ యూనివర్సిటీల్లో 2018-2023 మధ్య కాలంలో 6,901 మంది ఓబీసీ, 3,596 మంది ఎస్సీ, 3,939 మంది ఎస్టీ విద్యార్థలు చదువును మధ్యలోనే ఆపేశారు. ఐఐటీల్లో 2,544 మంది ఓబీసీ, 1,362 మంది ఎస్సీ, 538 మంది ఎస్టీ విద్యార్థలు కాలేజీ క్యాంపస్ లను వీడారు. 133 మంది ఓబీసీ, 143 మంది ఎస్సీ, 90 మంది ఎస్టీ విద్యార్థులు ఐఐఎంల క్యాంపస్ ను వీడి వెళ్లిపోయారు.
కాగా, ఐఐటీ మద్రాస్ లో పీహెచ్ డీ విద్యార్థి మార్చి31న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐఐటీ బాంబే క్యాంపస్ లో నెలకొన్న కుల వివక్షకు దర్శన్ సోలంకి అనే దళిత విద్యార్థి బలై పోయాడు. కుల వివక్షతను తట్టుకోలేక ఫిబ్రవరి 12న దర్శన్ సోలంకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీల్లో కుల వివక్ష, అంటరానితనం అనేది లేదని కేంద్రం బుకాయిస్తున్నా, అది వాస్తవం కాదని కుల వివక్ష కొనసాగుతుందని విద్యార్థులే చెబుతున్నారు.
Student Suicide : ర్యాగింగ్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య
క్యాంపస్ లో కుల వివక్ష ఉందని ఐఐటీలో చదువుతున్న పీహెచ్ డీ విద్యార్థి మహేశ్ పేర్కొన్నారు. సాయం చేయాలని కోరితే ఒక్కరు కూడా ముందుకు రాలేదని వాపోయారు. తమను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమస్యతో 2014లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంతో తామంతా స్టూడెంట్ సపోర్ట్ అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
కాలేజీ యాజమాన్యానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఇవేవీ అమలు కాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ను సంప్రదించే విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఫిర్యాదు చేస్తే క్యాంపస్ లో తమ పరిస్థితి మరింత దిగజారుతుందని కొంతమంది విద్యార్థులు భయపడుతున్నారని చెప్పారు.