Fenugreek Curry : శీతాకాలంలో మెంతి కూరను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు!

మెంతి కూరను ముఖ్యంగా శీతాకాలంలో తింటే చాలామంచిదని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Fenugreek Curry : మెంతి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో మెంతి కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ ఉంటాయి. మెంతి కూరలో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫాస్పరస్ ఉంటాయి. దీని వల్ల మెంతి ఆకులు తేలికగా ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేస్తాయి. చలికాలంలో అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఈ కాలంలో మెంతికూరను వివిధ రూపాల్లో తీసుకోవటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. మెంతి ఆకులు ఆహారపు రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.

మెంతి ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెంతి కూరను ముఖ్యంగా శీతాకాలంలో తింటే చాలామంచిదని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. ఇంకా మెంతి ఆకులను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేస్తే మచ్చలను, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది.

మెంతి ఆకుల్లో క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, సెలీనియం, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మెంతి ఆకుల్లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు మెంతికూర జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెంతి ఆకులు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మెంతి ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా అవుతుంది. అంతేకాదు బలంగా, ఒత్తుగా కూడా పెరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు