AP Infosys : APకి మరో దిగ్గజ IT సంస్థ.. రూ.750 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో.. తొలి ఏడాదిలోనే 7 వేల మందికి ఉద్యోగాలు..

AP Infosys : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ ఐటీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ కంపెనీకి 20 ఎకరాల స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP Government issued orders to allocate 20 acres land to infosys in visakhapatnam

  • ఏపీలో ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడులు
  • విశాఖలో ఇన్ఫోసిస్ కి 20 ఎకరాల భూమి కేటాయింపు
  • ప్రారంభంలోనే 7 వేల మందికి ఉద్యోగాలు

AP Infosys : ఏపీకి పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పలు దిగ్గజ కంపెనీలు ఏపీలో తమ కార్యాలయాలు స్థాపించి.. ఉద్యోగాలు కల్పించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ సర్కార్.. ఇన్ఫోసిస్‌ కంపెనీకి విశాఖపట్నంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కూటమి ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.. ఇన్ఫోసిస్ సంస్థ రాష్ట్రంలో సుమారు రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితో రాష్ట్రానికి భారీ స్థాయిలో ఐటీ రంగంలో వృద్ధి అవకాశాలు ఏర్పడనున్నాయి. అలానే విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ఆకర్షించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేసేందుకు గాను.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అనేక దిగ్గజ కంపెనీలు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ దిగ్గజ ఐటీ సంస్థ.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావడం.. రాష్ట్ర ఐటీ అభివృద్ధిలో కీలక ముందడుగు. విశాఖపట్నం భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.