Baba Vanga Gold Prediction : బాబా వంగా జోస్యం, ప్రధాని మోదీ పిలుపు.. గోల్డ్ రేట్లు ఇక త్వరలో..

Baba Vanga Gold Prediction : బంగారం ధర విషయంలో బాబా వంగ జ్యోస్యం నిజమయ్యిందని.. ప్రధాని మోదీ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు.

Baba Vanga gold prediction claims global financial and health crisis in 2026

Baba Vanga Gold Prediction : భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1.52 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మోదీ ఏడాది పాటు అత్యవసరమైతే తప్ప బంగారం కొనవద్దని ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే. అలానే వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలకే పరిమితం కావాలని తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెరుగుతున్న చమురు ధరలతో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న ఆరోగ్య విపత్తుల నేపథ్యంలో ప్రపంచం భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతోంది.

అయితే ఈ సంవత్సరం ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తుందని బాబా వంగా ముందే ఊహించారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2026లో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ‘బాబా వంగా’ ముందే పసిగట్టారని ఈ పోస్టుల్లో ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ లేదా బ్యాంకుల పట్ల ప్రజల్లో భయం మొదలైనప్పుడు, తమ డబ్బుకు రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో అందరూ బంగారం, వెండి కొనుగోలు చేయడానికి పరుగులు తీస్తారు.

* నిజమైన బాబా వంగా జ్యోస్యం.. బంగారం కొనవద్దన్న మోదీ.. త్వరలోనే రూ.2.25 లక్షలకు గోల్డ్ రేటు

ఇదే జరిగి ప్రపంచ పరిస్థితులు మరింత విషమిస్తే బంగారం ధరలు మరో 25 శాతం నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, భారతదేశంలో బంగారం ధర రూ. 1.9 లక్షల నుండి రూ. 2.25 లక్షల వరకు చేరి సరికొత్త రికార్డులను సృష్టించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాల వంటి అనేక అంశాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితుల్లో చుక్కలను తాకుతున్న బంగారం ధర.. ప్రపంచ పరిస్థితులు చక్కబడిన వెంటనే ధరలు అంతే వేగంగా పడిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జోస్యాలను నమ్మి పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు.

*బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం ఒక మంచి భద్రతనిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నప్పటికీ, విపరీతమైన ప్రచారం (Hype) జరుగుతున్న సమయంలో కొనుగోలు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి భయాందోళనతో అమ్మడం లేదా అతిగా కొనడం కాకుండా, స్థిరమైన మరియు సమతుల్యమైన విధానాన్ని పాటించాలని వారు సూచిస్తున్నారు.