కరోనా వచ్చిందని చైనా స్టయిల్‌లో అపార్ట్ మెంట్‌ని మెటల్ షీటుతో సీల్ వేశారు… అందరూ తిట్టే సరికి… లెంపలు వేసుకున్నారు!

  • Publish Date - July 24, 2020 / 07:43 AM IST

ఆ అపార్ట్ మెంట్లో ఒక కుటుంబానికి కరోనా వచ్చిందని ఏకంగా అపార్ట్ మెంటుకే మెటల్ షీటుతో సీల్ వేసేశారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోని రెండు ప్లాట్లకు పౌర సిబ్బంది సీల్ వేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే మెటల్ షీలింగ్ తొలగించారు. ఈ ఘటన బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ప్రాంతంలో జరిగింది.

ఇక్కడి కుటుంబాలలో ఒక కుటుంబానికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతే.. పౌర సంస్థ సిబ్బంది అపార్ట్ మెంట్ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్లను సీలు చేశారు. బెంగళూరు తూర్పు భాగంలో ఉన్న డోమ్లూర్‌లోని రాంకా హైట్స్ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ సంఘటన జరిగింది. అందులో ఉండే మరో వ్యక్తి.. సీల్ వేసిన అపార్ట్‌మెంట్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

‘కరోనా పాజిటివ్ అని తేలడంతో మా భవనంలో BBMP సీలింగ్ వేసింది. ఇద్దరు చిన్న పిల్లలతో ఒక మహిళతో పాటు పక్క గదిలోనే వృద్ధ దంపతులు ఉన్నారు.ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా నియంత్రించడం సాధ్యపడుతుంది. దయచేసి అత్యవసరంగా పరిష్కరించండి’ అని అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ నివాసి సతీష్ సంగమేశ్వరన్ ట్వీట్ చేశారు. కిరాణా సామాగ్రి, కుటుంబాలకు అవసరమైన వస్తువులను సరఫరా చేయడానికి అంతరాయం ఏర్పడుతోంది.

అపార్ట్ మెంట్ లోపల ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందానికి కూడా డోర్ సీలింగ్ అడ్డుపడుతుందని సంగమేశ్వరన్ తెలిపారు. అవసరమైన పెద్ద ప్యాకేజీలను పంపించడం అసాధ్యమని ఆయన ఎత్తి చూపారు. ఈ ట్వీట్ BBMP దృష్టికి రావడంతో పౌర అధికారులు వెంటనే మెటల్ షీట్‌ను తొలగించారు. మహమ్మారికి సంబంధించి తలెత్తే ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని బిబిఎంపి కమిషనర్ ఎన్ మంజునాథ ప్రసాద్ తెలిపారు. స్థానిక సిబ్బంది చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నామని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.


అంతర్గత విచారణ కొనసాగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్‌, ఇన్‌ఛార్జి అధికారులకు నోటీసు అందజేస్తామని బిబిఎంపి ఈస్ట్‌జోన్ కో-ఆర్డినేటర్ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. భాసిన్ అనే మహిళ జూలై 7న జ్వరం బారినపడింది. జూలై 15న COVID-19 లక్షణాలు కనిపించేవరకు టెలిమెడిసిన్ సహాయాన్ని పొందుతూ వచ్చింది.

డొమెస్టిక్ హెల్ప్ మహిళ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత జూలై 18న ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అప్పటినుంచి అపార్ట్ మెంట్లో నుంచి బయటకు రాలేదని భాసిన్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని తెలిపారు. ఆ అపార్ట్ మెంటులో మహిళ భాసిన్ తన 9ఏళ్లు, 10 ఏళ్ల పిల్లలతో నివసిస్తోంది. ఆమె పక్క గదిలోనే వృద్ధ దంపతులు, వారి రెండేళ్ల మనవడితో నివసిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు