ఆగస్ట్ 15న సీఎం ఆఫీసుకు భూమిపూజ, దసరాకు విశాఖకు రాజధాని

  • Publish Date - July 31, 2020 / 05:29 PM IST

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్రపడటంతోనే లైన్ క్లియర్. పాలన రాజధానిగా విశాఖ ఠీవిగా నిలబడనుంది. ఇంతకీ ఎప్పటికీ జగన్ అక్కడకు తరలివెళ్లనున్నారు? అంటే నాలుగు నెలలే అని సమాధానం.

అక్టోబర్ 25న విజయదశమి. సెప్టెంబర్ తర్వాత కరోనా తగ్గుతుందన్నది అంచనా. అందుకే ప్రభుత్వం దసరా రోజునే విశాఖలో పాలనారాజధానిగా ఏర్పాటు చేయడానికి సిద్ధమైయ్యారు.


ఇంతకు ముందే అసెంబ్లీ రెండోసారి అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రభుత్వం అంటే మూడు రాజధానుల బిల్లును ఆమోదించింది. మండలి పక్కన పెట్టినా జూలై 17 నాటికి నెల పూర్తి అయితే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందినట్లేనన్నది నిపుణుల మాట. భోగాపురం విమానాశ్రయం సమీపంలోనే 500 ఎకరాల్లో కేపిటల్ ఎర్పాటుచేయడానికి ప్లాన్స్ రెడీ అవుతున్నాయి.




అందుకే గవర్నర్ న్యాయసలహా తీసుకున్నారు. స్టాంప్ వేశారు. ఆగస్టు 15న భూమి పూజ మొదలుపెట్టి షిఫ్టింగ్ మ్మదిగా…రాజధానిని అక్టోబర్ నాటికి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు