అదో రంగుల నది.. అన్ని నదుల్లా నీళ్లు ఒకేలా కనిపించవు.. ఈ నదిలో నీళ్లు గులాబీ రంగులో కనిపిస్తాయి.. దీనికి రెయిన్ బో రివర్ అనే పేరు కూడా ఉంది.. ఇంతకీ ఈ నది ఎక్కడ ఉందంటే? దక్షిణ అమెరికాలోని కొలంబియాలో.. గులాబీ రంగులో కనువిందు చేసే ఈ రంగుల నదిని చూసి జనమంతా ఆశ్చర్య పోతున్నారు..
వాస్తవానికి ఈ నదికి మరో పేరు కూడా ఉంది.. ‘కనో క్రాస్టాలీస్’. రంగులతో నిండిపోయిన ఈ రంగును చూసి పర్యటకులంతా ఆశ్వాదిస్తున్నారు. ఈ ప్రాంతంలో ‘మకరేనియా క్లేవిగెరా’అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి.
అందుకే ఈ నదిలో రంగు అలా కనిపిస్తుందని అంటున్నారు. ఈ నదికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. ‘షీల్డ్ ఆఫ్ గయానా’గా పిలుస్తుంటారు.. రాళ్లల్లో ఖనిజాలు ఉండటంతో నదికి ఈ రంగు వచ్చిందని చెబుతుంటారు. రాళ్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవని అంటున్నారు..
ఈ మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయట. భూమిలోని ఖనిజాలకు తగినట్టుగా పూల రంగు ఉంటుంది. అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం కలిశాయని, ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు.