Karnataka : మటన్ బిర్యానీలో బీఫ్ మిక్సింగ్…హిందూ సంఘాల ఆరోపణ
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు చిక్కమగళూరులోని రెండు హోటళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో బీఫ్ ను పట్టుకున్నారు....
- saleem sk
- Published On : September 1, 2023 / 06:11 AM IST
Cops raid eateries
Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు చిక్కమగళూరులోని రెండు హోటళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో బీఫ్ ను పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఓ హోటల్ వంటగదిలో బీఫ్ నిల్వ ఉంచినట్లు పోలీసులు చెప్పారు. (beef mixing in biryani)
Neeraj Chopra : జూరిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల త్రోతో రెండో స్థానం
బిర్యానీలో బీఫ్ మిక్సింగ్ చేస్తున్నారని పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో తేలడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. (Cops raid eateries) బెంగుళూరు, ఎవరెస్ట్ హోటళ్ల యజమానులకు తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి లతీఫ్, శివరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ( Hindu groups claim beef mixing in biryani)
Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి
మటన్ బిర్యానీలో బీఫ్ కలపడంపై వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్ చేయగా.. వారు గోమాంసం నిల్వ ఉంచినట్లు నిర్ధారణ అయింది. తాము ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని చిక్కమగళూరు ఎస్పీ చెప్పారు.
