Neeraj Chopra : జూరిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల త్రోతో రెండో స్థానం

గోల్డెన్ బాయ్, భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నారు. జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 85.71 మీటర్ల బెస్ట్ త్రోతో రెండో స్థానం సాధించాడు....

Neeraj Chopra : జూరిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా 85.71 మీటర్ల త్రోతో రెండో స్థానం

Neeraj Chopra

Neeraj Chopra : గోల్డెన్ బాయ్, భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నారు. జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 85.71 మీటర్ల బెస్ట్ త్రోతో రెండో స్థానం సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచిన చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ 88.86 మీటర్లతో అగ్రస్థానంలో ఉండగా, జూలియన్ వెబర్ 85.04 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. (Neeraj Chopra Finishes Second In Zurich Diamond League) పురుషుల లాంగ్‌జంప్‌లో భారత్‌కు చెందిన మురళీ శ్రీశంకర్ 7.99 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.

Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి… 9 మంది పాక్ సైనికుల మృతి

అంతకుముందు నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ అథ్లెట్‌గా చరిత్రలో నిలిచారు. ఈ పోటీలో రెండో స్థానం దక్కించుకోవడంతో నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత పురుషుల జావెలిన్ ఫైనల్‌లో 88.17 మీటర్ల ప్రయత్నంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని పొందారు.

YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?

చోప్రాకు ఆసియా క్రీడల బంగారు పతకం, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, డైమండ్ లీగ్ టైటిల్, ఆసియా ఛాంపియన్‌షిప్ స్వర్ణం , యూ-20 ప్రపంచ టైటిల్ కూడా లభించాయి.