Variety Juice Shop: సైకిల్ తొక్కితేనే జ్యూస్ వస్తుంది: వెరైటీ జ్యూస్ బార్

నేరుగా జ్యూస్ మాత్రమే తాగితే ఏం లాభం, బాగా వర్కౌట్లు, వ్యాయామాలు చేసి... అప్పుడు జ్యూస్ లు ఇతర పౌష్ఠిక ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదని కొందరు సలహాలిస్తుంటారు.

Juice Bar

Variety Juice Shop: ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు, పండ్ల రసం తాగమంటూ వైద్యులు, ఆరోగ్య నిపుణులు చూస్తుంటారు. సాధారణంగా ఫ్రూట్ జ్యూస్ కావాలంటే షాప్ కి వెళ్లి, మెనూ చూసి… నచ్చిన జ్యూస్ ఆర్డర్ చేస్తే క్షణాల్లో మనముందు ఉంచుతాడు షాప్ వాడు. నేరుగా జ్యూస్ మాత్రమే తాగితే ఏం లాభం, బాగా వర్కౌట్లు, వ్యాయామాలు చేసి… అప్పుడు జ్యూస్ లు ఇతర పౌష్ఠిక ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదని కొందరు సలహాలిస్తుంటారు. అయితే కొందరు మాత్రం వ్యాయామం చేసేందుకు అంతగా ఉత్సాహం చూపించరుకానీ, జ్యూస్ మాత్రం జుర్రుతుంటారు. అయితే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఈ జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఆ జ్యూస్ షాపులో ఎరేంజిమెంట్స్ అలా ఉన్నాయి మరి.

Also Read: Top Smartphones in 2021: 2021లో వచ్చిన టాప్ ఫోన్స్: మీ ఫోన్ ఉందా?

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని “గ్రీనోబార్” అనే జ్యూస్ షాప్ లో, వినియోగదారులు నేరుగా జ్యూస్ పిండుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు చేసారు దుకాణదారుడు. ఇక్కడకు వచ్చే వినియోగదారులు తమకు కావాల్సిన జ్యూస్ ఆర్డర్ చేయగానే, అందుకు సంబందించిన ఫ్రూట్స్, ఇతర పదార్ధాలు మిక్సీలో వేసి వెళ్ళిపోతారు సహాయకులు. సైకిల్ పెడల్ కు అమర్చిన మిక్సీ, సైకిల్ తొక్కడంతోనే తిరుగుతుంది. దీంతో కస్టమర్లే ఆసైకిల్ ఎక్కి తొక్కుకుని కావాల్సినంత జ్యూస్ పిండుకుని తాగుతారు. ఇది అటు వ్యాయామంగాను, ఇటు ఉపయోగంగాను ఉండడంతో వినియోగదారులు ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడుతున్నారు.

Also Read: New Smartphone: అదిరిపోయే ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్: టెక్నో స్పార్క్ 8

వినియోగదారులకు ఆరోగ్యం, వ్యాయామం పై అవగాహన కల్పించేందుకే ఈ ఆలోచనతో వచ్చినట్లు దుకాణదారుడు పేర్కొన్నాడు. జీరో వేస్ట్ పాలసీని అవలంభిస్తున్న ఈ “గ్రీనోబార్” జ్యూస్ షాపు, జ్యూస్ తాగేందుకు వచ్చిన వినియోగదారులకు ప్లాస్టిక్, గాజు గ్లాసులకు బదులుగా సహజసిద్ధమైన పద్ధతుల్లో జ్యూస్ అందిస్తుంది. కప్ లకు బదులుగా కొబ్బరి చిప్పలు, ప్లేట్ లకు బదులుగా గుజ్జు తీసేసిన పుచ్చకాయలో జ్యూస్ ని సర్వ్ చేస్తున్నారు. ఆరోగ్యం, ప్రకృతి అనే నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని గ్రీనోబార్ యజమాని చెప్పుకొచ్చారు.