Mehwish Hayat, Dawood’s ‘Most Wanted Girlfriend: అండర్ వరల్డ్ డాన్.. దావుద్ ఇబ్రహీం ప్రేమాయణం హట్ టాపిక్. లేటు వయస్సులో సీక్రెట్‌గా ప్రేమించాడు. గుట్టుగా దాచాడు. అలాంటిది రచ్చ అయ్యేసరికి డాన్‌కు టెన్షన్. తన సీక్రెట్ ప్రేమాయణం గురించి ఎలా లీక్ అయిందో తెలియక జుట్టు పీకుంటున్నాడంట..
ఎంత అండర్ వరల్డ్ డాన్ అయితే మాత్రం ఆయనకు మాత్రం రొమాంటిక్ నేచర్ ఉండదా? బాలీవుడ్‌లో మందాకినితో ప్రేమాయణం సంగతి తెలుసుకదా. కాకపోతే 60 ఏళ్ల డాన్ పాకిస్థాన్ సినీనటితో ప్రేమాయణం అంటేనే క్యూరియాసిటీ.
ఈ సీక్రెట్ ప్రేమాయణం ఎలా లీక్ అయిందో తెలియదు కానీ.. జీ న్యూస్, DNA బయటపెట్టింది.. పాకిస్తాన్ నటి మెహ్వీష్ హయత్‌తో దావూద్ రిలేషన్ షిప్ ఉందని తెలిసింది. ప్రియాంక చోప్రా అంటే నోటికి పనిచెప్పే ఈ స్టార్ హీరోయిన్‌కు మంచి ఫాలోయింగే ఉంది.
1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఇండియా వాంటెడ్ లిస్టులో ఉన్న దావుద్.. పాకిస్థాన్‌లో కరాచీలో చాలా ఏళ్లుగా తలదాచు కుంటున్న సంగతి తెలిసిందే.. వయస్సు 60ఏళ్లు దాటేశాయి..
ప్రియసికి 37ఏళ్లు.. అంటే 27 ఏళ్ల గ్యాప్. దావుద్ అంటే పాక్‌లో చాలా భయం…ఆసక్తి ఉన్నాయి. ఎక్కడ ఉంటాడో తెలియకుండా జాగ్రత్తపడే దావూద్ ,మెహ్వీష్ ను ఎక్కడ కలిశాడు? ఎలా ప్రేమిస్తున్నాడు? చాలా ప్రశ్నలున్నాయి. ఎవరైనా ట్రాక్ చేస్తే దావూద్‌కి రిస్క్. అందుకే అసలు ఎవరూ లీక్ చేసి ఉంటారో తెలుసుకునే పనిలో పడ్డాడంట..
మెహ్విష్ హయత్ ఎవరు? :
Who is Mehwish Hayat, the Pakistani Actress: పాకిస్థాన్ సినీ నటి మెహ్విష్ హయత్.. జనవరి 6, 1983లో పుట్టింది.. లోడ్ వెడ్డింగ్, పంజాబ్ నహి జాంగి, యాక్టర్ ఇన్ లా వంటి చాలా మూవీల్లో నటించింది. ఒకప్పుడు మెహ్విష్ అంటే ఎవరో తెలియదు.. దావూద్ ప్రియసి కావడంతో ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చేవి.. దావూద్ పాపులారిటీతో మెహ్విష్ కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. పాక్ సినీ పరిశ్రమను ఊపు ఊపేస్తోంది..
దావూద్‌తో రిలేషన్ ఎలా? :
దావూద్‌కు ప్రియసి మెహ్వీష్ వయస్సు చిన్నది. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న అండర్ వరల్డ్ డాన్.. దావూద్‌కు అసలు బలహీనత మెహ్వీష్ అంటూ చెబుతుంటారు.. అప్పటినుంచి ఆమెను ‘గ్యాంగ్‌స్టర్ డాల్’ అని పిలవడం మొదలుపెట్టారు.
మెహ్వీష్ కెరీర్ సినీ పరిశ్రమతో మొదలైంది.. కరాచీకి చెందిన ఓ సెలబ్రిటీతో వ్యక్తితో ఉన్న సంబంధాల వల్లే దావూద్‌తో ఆమెకు పరిచయం. అప్పటినుంచి దావూద్ అన్ని ప్రాజెక్టుల్లోనూ మెహ్వీష్ ప్రమేయం ఉండేది.. సినిమాల్లోనూ ఆమెకు బోలెడు అవకాశాలను తెచ్చిపెట్టాయి..