MAA Elections: ‘మా’కు తెలుగువాడు పనికిరాడా.. ఆలోచించండి!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో.. యాక్టర్, డైరెక్టర్ రవిబాబు ఎంటర్ అయ్యారు. తెలుగు వాళ్లనే.. మా.. అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని కామెంట్ చేశారు.
- Ravikanth 10tv
- Published On : October 6, 2021 / 11:43 AM IST
Ravibabu 11zon
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో.. యాక్టర్, డైరెక్టర్ రవిబాబు ఎంటర్ అయ్యారు. తెలుగు వాళ్లనే.. మా.. అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని కామెంట్ చేశారు. మన సమస్యలు పరిష్కరించుకునేందుకు మనం పెట్టుకున్న చిన్న అసోసియేషన్ ‘మా’ అని చెప్పిన రవిబాబు.. బయటి వాళ్లకు ఎందుకు బాధ్యతలు అప్పగించాలని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు.
Also Read: MAA Elections: ప్రకాష్ రాజ్‌కు ఇదే నా హెచ్చరిక.. ఇకపై రిపీట్ అయితే మర్యాదగా ఉండదు!
ఇతర భాషల నుంచి వచ్చే నటులు, టెక్నీషియన్ల గురించి కూడా.. రవిబాబు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వందల సంఖ్యలో కెమెరా మెన్లు పని లేక ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. చివరికి.. మేకప్, ఇతర విభాగాల టెక్నీషియన్లనూ నిర్మాతలు బయటి నుంచే తెప్పించుకుంటున్నారని అన్నారు. ఇలా.. నటులు, టెక్నీషియన్లు బయటి నుంచి వస్తుంటే.. మన వాళ్లకు టాలెంట్ లేదని అనుకోవాలేమో అని.. ఇది బయటి వాళ్ల అదృష్టమని.. మనవాళ్ల దురదృష్టమని కామెంట్ చేశారు.
Also Read: MAA Elections : ఇండస్ట్రీని విడగొట్టాలని చూస్తే ఊరుకోను : మంచు విష్ణు
నటులు, టెక్నీషియన్ల వ్యవహారం నిర్మాతల ఇష్టాన్ని బట్టి ఉంటుందని రవిబాబు చెప్పారు. కానీ.. ‘మన సమస్యల పరిష్కారానికి.. మనమంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ‘మా’ అసోసియేషన్ ను నడిపించుకునేందుకు.. మనలో ఒకడు పనికి రాడా.. ఈ విషయానికీ బయటినుంచే మనుషులను తెచ్చుకోవాలా’.. అంటూ తన అభిప్రాయాన్ని ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టారు. ఇదంతా పరిశీలిస్తున్నవాళ్లు.. మంచు విష్ణుకే రవిబాబు మద్దతు అని.. ఫిక్సైపోతున్నారు.
Also Read: MAA Elections : సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన ఎన్నికల అధికారి
