MAA Elections: ప్రకాష్ రాజ్‌కు ఇదే నా హెచ్చరిక.. ఇకపై రిపీట్ అయితే మర్యాదగా ఉండదు!

మా.. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు డైలాగ్ వార్.. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. ఇంకో సారి తన ఫ్యామిలీ పేరు తీస్తే ఊరుకోబోనని ప్రకాష్ రాజ్‌ను మంచు విష్ణు హెచ్చరించారు.

MAA Elections: ప్రకాష్ రాజ్‌కు ఇదే నా హెచ్చరిక.. ఇకపై రిపీట్ అయితే మర్యాదగా ఉండదు!

Manchu

మా.. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు డైలాగ్ వార్.. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. ఇంకో సారి తన ఫ్యామిలీ పేరు తీస్తే.. ఊరుకోబోనని ప్రకాష్ రాజ్‌ను మంచు విష్ణు హెచ్చరించారు. రిపీట్ అయితే.. బాగుండదని అన్నారు. తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పోటీలో ఉన్నానని.. తన తండ్రి, అక్క, తమ్ముడు, భార్య.. ఎవరైనా ఎవరికైనా ఫోన్ చేసి ఓట్లు అడుగుతారని.. అందులో ఏం తప్పుందని ప్రశ్నించారు. ఇకపై.. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడవద్దని ప్రకాష్ రాజ్‌కు తేల్చి చెప్పారు. అలాగే.. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో.. ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలను మంచు విష్ణు తిప్పి కొట్టారు. ప్రకాష్ రాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ గుడ్ యాక్టర్ అని ఇవాళ అందరికీ అర్థమైందని చెప్పారు.

Also Read: Prakash Raj: మంచు విష్ణుపై “మా” అధికారికి ఫిర్యాదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్!

ప్రకాష్ రాజ్ అడిగిన ప్రతి ప్రశ్నకూ.. క్లారిటీ ఇస్తానని విష్ణు చెప్పారు. పేపర్ బ్యాలెట్ మాత్రమే కావాలని తాను కోరుతూ ఎన్నికల అధికారికి లేఖ రాశానని.. తన ప్యానెల్ లో చాలా మంది పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు కోరుతున్నారని అన్నారు.  ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా తాను గెలుస్తానని.. అప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అదే పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు జరిగితే.. ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చని చెప్పారు.

Also Read: MAA Elections : ‘మా’లో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యలో మెగాస్టార్..

“మా ఎలక్షన్ కమిషన్.. 60 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నామని చెప్పింది. కోవిడ్ వంటి ఇబ్బందుల కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మెసేజ్ కూడా పెట్టారు. నేను ప్రెసిడెంట్ గా పోటీ పడుతున్నా. నాకు ప్రతి ఓటర్ ను ఓటు అడిగే హక్కు ఉంది. రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది. 60 ఏళ్లు దాటిన చాలా మందికి నేను ప్రత్యేకంగా ఫోన్ చేశాను. అందులో కొందరు ఫిజికల్ గా వచ్చి ఓటు వేస్తానని చెప్పారు. మరికొందరు పోస్టల్ బ్యాలెట్ కు వెళ్తామన్నారు. సమయం మించిపోతుందేమో అని.. చాలా మంది నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. పోస్టల్ బ్యాలెట్ డబ్బులు ఇస్తామని.. కలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. అప్పుడు మేం ఎలక్షన్ కమిషన్ ను సంప్రదించాం. సింగిల్ రిసిప్ట్ తో.. లీగల్ విధానంలో డబ్బులు కట్టాం. అది ఇల్లీగల్ కాదు. తర్వాత.. ఎన్నికల కమిషన్ మమ్మల్ని సంప్రదించింది. పోస్టల్ బ్యాలెట్ జారీకి టైమ్ ఇస్తామని చెప్పి.. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చింది. ఈ విషయంలో ప్రకాష్ రాజే బీపీ మాత్రలు వేసుకోనట్టుగా ఆవేశపడ్డారు. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అంతా పద్ధతి ప్రకారమే నడుచుకున్నాం” అని మంచు విష్ణు స్పష్టం చేశారు.

Also Read: Balakrishna : బాలయ్య ఓటు కూడా నాకే : మంచు విష్ణు

తనకు తానుగా శరత్ బాబుకు ఫోన్ చేసి.. విషయం చెప్పి పోస్టల్ బ్యాలెట్ గురించి మాట్లాడానని.. విష్ణు చెప్పారు. ఆయన సరే అని.. తనకే ఓటు వేస్తానని చెప్పి.. ఆశీర్వదించారన్నారు. ఇలా.. చాలా మంది సీనియర్ నటుల పేర్లను ప్రకాష్ రాజ్ తప్పుగా ప్రస్తావించారంటూ విష్ణు అభ్యంతరం చెప్పారు. ముందు.. సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఆరోపణలు చేసే ముందు సరిగా వివరాలు తెలుసుకుని రావాలన్నారు. తమిళులు, కన్నడిగులను అడిగితే.. ప్రకాష్ రాజ్ నిజ స్వరూపం తెలుస్తుందన్న విష్ణు… వాళ్లు ఈయన్ను అడ్డుకుంటున్నారని.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మన దగ్గరకు వచ్చారని విమర్శించారు. చివరికి ప్రకాష్ రాజ్, జీవిత, శ్రీకాంత్.. మంచు కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని అభ్యంతరం చెప్పారు. అది ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటా.. తాను వారి గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. గెలుపు, ఓటమికి సంబంధం లేకుండా.. అంతా కలిసి కుటుంబంలా ముందుకు పోదామని అన్నారు.. విష్ణు.