MAA Elections : ‘మా’లో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యలో మెగాస్టార్..

'మా' ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ వరుసగా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఒకరి పై

MAA Elections : ‘మా’లో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యలో మెగాస్టార్..

Maa

MAA Elections :  ‘మా’ ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ వరుసగా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కేవలం ప్రెస్ మీట్స్ పెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుస్తూ ఓట్లు అడుగుతున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మహా అయితే వెయ్యి మంది ఉంటారు. కానీ ఈ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే రసవత్తరంగా మారాయి.

ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో ‘మా’ అసోసియేషన్ పరువు దిగజారుస్తున్నారు అని, తమ పరువు తామే తీసుకుంటున్నామని మోహన్‌ బాబు సీరియస్ అయ్యాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ చిరంజీవి మాత్రమే పెద్దదిక్కు అని, ఆయన కాకుండా ఇంకెవరూ లేరు అని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్ ను చిరంజీవి సపోర్ట్ చేస్తున్నాడు అని నాగ బాబు వచ్చి మరీ మీడియా ముందు చెప్పాడు. మొన్న పవన్ స్పీచ్ ని కూడా ప్రకాష్ రాజ్ సమర్ధించారు. మెగా ఫ్యామిలీ అండ ప్రకాష్ రాజ్ కి బాగానే ఉంది.

Cinema Hall Water: సినిమా థియేటర్‌లోకి బయటి వాటర్ అనుమతించకపోతే ఉచితంగా మీరే ఇవ్వాలి – హైకోర్టు

ఇక ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకి మోహన్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలని ఇప్పుడు బయటకి తీసి వైరల్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుతోనే సినీ పెద్దలు అనే పదానికి ముగింపు వచ్చేసిందని, ప్రస్తుతం సినీ పెద్దలు అంటూ ఎవరూ లేరని మోహన్‌ బాబు గట్టిగా చెప్పాడు. దీంతో ప్రకాష్ రాజ్ చిరంజీవి ఒక్కడే సినీ పెద్ద అనడంతో సంచలనంగా మారింది. టాలీవుడ్ పెద్దదిక్కు చిరంజీవి మాత్రమే అని ప్రకాశ్ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సీనియర్స్ కి నచ్చడం లేదు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా కాంట్రవర్సీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిపై ప్రకాశ్‌ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Prabhas : అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ స్పెషల్ ఫిలిం

మరోసారి మంచు విష్ణు పై విమర్శలు చేస్తూ.. నేను అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే మంచు విష్ణుకు ఫోన్ చేస్తాను అని, ‘మా’ బిల్డింగ్ కట్టడానికి సహాయం అడుగుతాను అని అన్నారు ప్రకాశ్ రాజ్‌. మా ఎన్నిక‌ల్లో తాను ఎందుకు పోటీ చేయకూడదు? మా అసోసియేషన్ ఎప్పుడూ కొన్ని కుటుంబాల ఆధీనంలోనే ఉండాలా?? అని ప్రశ్నించాడు. తనకు ఇక్కడే ఆధార్ కార్డు ఉంద‌ని, సొంత ఇల్లు ఉంద‌ని అందుకే పోటీ చేస్తున్నాన‌ని అన్నారు. ‘మా’ ఎలక్షన్స్ అయ్యేదాకా ఈ వేడి ఇంకా పెరుగుతుందే త‌ప్ప త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. చూడాలి మరి ఈ సారి ‘మా’ అధ్యక్షుడు అయ్యే యోగం ఎవరికీ ఉందో.