MAA Elections : ఇండస్ర్టీని విడగొట్టాలని చూస్తే ఊరుకోను : మంచు విష్ణు

పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో తాను కుట్ర చేస్తున్నానని ప్రకాష్‌రాజ్‌ చేసిన ఆరోపణల్ని ఖండించారు. అరవై ఏళ్ళకి పై బడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సంఘం

MAA Elections : ఇండస్ర్టీని విడగొట్టాలని చూస్తే ఊరుకోను : మంచు విష్ణు

Maa

MAA Elections :  రోజు రోజుకి ఇండస్ట్రీలో ‘మా’ ఎలక్షన్స్ వల్ల హీట్ పెరిగిపోతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వరుస ప్రెస్ మీట్స్ తో యుద్దానికి తెర లేపుతున్నారు. తాజాగా నిన్న ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారికి మంచు విష్ణు మోసాలకు పాల్పడుతున్నాడు ఓట్ల కోసం అంటూ ఫిర్యాదు చేశారు. మరో వైపు విష్ణు బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగాలని విన్నవించారు. బ్యాలెట్ పద్దతి అయితే రిగ్గింగ్ చేస్తారని ప్రకాష్ రాజ్ వ్యతిరేకిస్తున్నారు. నిన్న మళ్ళీ మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో తాను కుట్ర చేస్తున్నానని ప్రకాష్‌రాజ్‌ చేసిన ఆరోపణల్ని ఖండించారు. అరవై ఏళ్ళకి పై బడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ‘మా’లో అరవై సంవత్సరాలకు పై బడిన వారు 160 మంది వరకు ఉన్నారు. వాళ్లందరికీ నేనే స్వయంగా ఫోన్‌ చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలా అని అడిగాను. కానీ పోలింగ్‌ కేంద్రానికే వచ్చి ఓటు వేస్తామని వందమందికి పైగా చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు మాత్రం పోస్టల్‌ బ్యాలెట్‌లో వేస్తామని చెప్పారు. వాళ్లు ఎన్నికల అధికారికి లెటర్‌ ఎలా రాయాలో తెలియజేస్తూ నేను ఓ ఫార్మాట్‌ను పంపించా. ఆ లెటర్స్‌ను వాళ్లే స్వయంగా కొరియర్‌లో ‘మా’ ఆఫీస్‌కు పంపించారు. అంతే కానీ ప్రకాష్‌రాజ్‌ చెబుతున్నట్లు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే లెటర్లను తీసుకురాలేదు. ప్రకాష్‌రాజ్‌ అహంకారి. ‘మా’అసోసియేషన్‌ను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని విష్ణు ఆరోపించారు.

RRR : తెలుగు నిర్మాతల మధ్య విభేదాలు.. ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా తప్పదా??

అందుకే ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అనేది, ప్రకాష్ రాజ్ ఎలక్షన్స్ ని వాడుకొని ఇండస్ట్రీని విడగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.