RRR : తెలుగు నిర్మాతల మధ్య విభేదాలు.. ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా తప్పదా??

ఇటీవలే తెలుగు అగ్ర నిర్మాతలంతా ఏపీ ప్రభుత్వాన్ని కలిశారు. టికెట్ రేట్లపై, ఆన్లైన్ టికెట్ బుకింగ్ పై చర్చించారు. మరోసారి అగ్ర నిర్మాతలంతా కలిసే అవకాశం ఉంది. త్వరలో ప్రొడ్యూసర్

RRR : తెలుగు నిర్మాతల మధ్య విభేదాలు.. ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా తప్పదా??

Rrr

RRR :  ఇటీవలే తెలుగు అగ్ర నిర్మాతలంతా ఏపీ ప్రభుత్వాన్ని కలిశారు. టికెట్ రేట్లపై, ఆన్లైన్ టికెట్ బుకింగ్ పై చర్చించారు. మరోసారి అగ్ర నిర్మాతలంతా కలిసే అవకాశం ఉంది. త్వరలో ప్రొడ్యూసర్ గిల్ట్ మీటింగ్ కూడా జరగనుంది. ఈ మీటింగ్ ఉద్దేశం పెద్ద సినిమాల రిలీజ్ డేట్లే అని తెలుస్తుంది. ఇటీవల ప్రకటించిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్లతో నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం.

కరోనా కారణంగా గత ఏడాది నుంచి రెండు మూడు పెద్ద సినిమాలు తప్ప ఎక్కువ రిలీజ్ అవ్వలేదు. కానీ ఇటీవల పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా తమ రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశారు. సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఈ క్రమంలో పెద్ద సినిమాల మద్య క్లాష్ లు అవుతున్నాయి. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. ఇవి వరుసగా మూడు డేట్స్ లో రిలీజ్ అవ్వనున్నాయి. ఇవి చాలవు అన్నట్టు ‘ఆర్ఆర్ఆర్’ కూడా సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించింది. దీనివల్ల అన్ని సినిమాలు కూడా కలెక్షన్స్ విషయంలో నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ప్రొడ్యూసర్ గిల్ట్ మీటింగ్ పెట్టుకొని రిలీజ్ డేట్స్ పై మాట్లాడాలని అనుకుంటుంది.

BiggBoss : తమిళ్ బిగ్ బాస్ లో తెలుగమ్మాయి

లాస్ట్ టైం సంక్రాంతికి, అంతకు ముందు కూడా ఇలాగే రిలీజ్ చేశారు ఏదో ఒక సినిమా కచ్చితంగా నష్టపోవాల్సి వచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదు అని ఈ సారి నిర్మాతలు కూర్చొని మాట్లాడుకోవాలని అనుకుంటున్నారు. ఆ నాలుగు కాకుండా ఇంకా కొన్ని సినిమాలు జనవరి లోనే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇది కూడా సినిమా కలెక్షన్స్ ని దెబ్బ తీసే అవకాశం ఉంది. క్లాష్ కాబోతున్న సినిమాల కోసం నిర్మాతల సంఘం పెద్దలు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన పెద్ద నిర్మాతలు అంతా కూడా ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా నష్టం జరుగకుండా సినిమాల విడుదల తేదీల విషయంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని సమాచారం. గిల్ట్ లో చర్చించిన తర్వాత ఇప్పటికే డేట్ ఖరారు చేసిన సినిమాల విడుదల తేదీలు కూడా మారే అవకాశం ఉంది.

Mahesh Babu : నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది : మహేష్

ఈ సినిమాల రిలీజ్ డేట్స్ ని చూసి ‘ఆచార్య’, ‘అఖండ’ సినిమాలు తమ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేదీ నిర్ణయం విషయంలో కొందరు నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు. సంక్రాంతికి వస్తామని తాము ముందుగానే ప్రకటించినా ఇప్పుడు సంక్రాంతి కి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని దించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంది.