BiggBoss : తమిళ్ బిగ్ బాస్ లో తెలుగమ్మాయి

తెలుగు బిగ్ బాస్ తో పాటు తమిళ్ బిగ్ బాస్ కూడా గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ సారి తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అయి సీజన్ 5లో నాలుగు వారాలు కూడా పూర్తి చేసుకుంది. కరోనా నేపథ్యంలో

BiggBoss : తమిళ్ బిగ్ బాస్ లో తెలుగమ్మాయి

Pavani

BiggBoss :  తెలుగు బిగ్ బాస్ తో పాటు తమిళ్ బిగ్ బాస్ కూడా గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ సారి తెలుగు బిగ్ బాస్ ప్రారంభం అయి సీజన్ 5లో నాలుగు వారాలు కూడా పూర్తి చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు తమిళ్ బిగ్ బాస్ జరుగుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ప్రోమోలు, నిన్న బిగ్ బాస్ టెలికాస్ట్ మొదలవ్వడంతో తమిళ్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. తమిళ్ బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కమల్ హాసన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. వరుసగా ఐదవ సారి కూడా తమిళ్ బిగ్ బాస్ కి కమల హాసన్ హోస్ట్ చేస్తున్నారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 5 లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించడం జరిగింది. అందులో ఒక కంటెస్టెంట్ మన తెలుగు అమ్మాయి.

Junior NTR : ‘మా’ ఎలక్షన్స్ లో ఓటు వేయను : జూనియర్ ఎన్టీఆర్

తెలుగు అమ్మాయి పావని రెడ్డి నిన్న స్టార్ట్ అయిన తమిళ్ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో డబుల్ ట్రబుల్, డ్రీం, ది ఎండ్, లజ్జ సినిమాల్లో నటించింది. అలాగే ‘నేను ఆయన ఆరుగురు అత్తలు’, ‘నా పేరు మీనాక్షి’, అగ్నిపూలు’, ‘శ్రీమతి’ సీరియల్స్ లో కూడా నటించింది. అయితే ఇక్కడ అనుకున్నంత గుర్తింపు రాకపోవడం, ఆమె భర్త ఆత్మహత్య చేసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీని వదిలి తమిళనాడుకి వెళ్ళిపోయింది.

తమిళ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం గట్టిగానే కష్టపడింది. ఇప్పటికే తమిళ్ లో అయిదు సినిమాలు చేసింది. ఆరు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తూ తమిళ్ లో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి ఎంటర్ అయింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన పావని రెడ్డి తమిళం కూడా చక్కగా మాట్లాడుతుంది. కానీ తమిళ జనాలకు ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి తెలుగు అమ్మాయి అయిన పావని రెడ్డికి ఎంత వరకు తమిళ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది అనేది చూడాలి.