Junior NTR : ‘మా’ ఎలక్షన్స్ లో ఓటు వేయను : జూనియర్ ఎన్టీఆర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఇరు ప్యానల్స్ మధ్య యుద్ధం తీవ్రమవుతుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వరుస ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. మరో పక్క

Junior NTR : ‘మా’ ఎలక్షన్స్ లో ఓటు వేయను : జూనియర్ ఎన్టీఆర్

Maaele

Junior NTR :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఇరు ప్యానల్స్ మధ్య యుద్ధం తీవ్రమవుతుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వరుస ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. మరో పక్క మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ‘మా’ ఎలక్షన్స్ పైనే చర్చ జరుగుతుంది. మంచు విష్ణు తనకు బాలకృష్ణ, కృష్ణ, కృష్ణం రాజు ఇలా పెద్ద పెద్ద వాళ్లంతా సపోర్ట్ చేస్తున్నారు అని ప్రకటించారు. వాళ్ళందర్నీ కలిసి ఓట్లు కూడా అభ్యర్థించారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తనకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదని మీడియా ముందే చెప్పారు. మెగా ఫ్యామిలీ మాత్రం ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘మా’ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న జీవిత ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

MAA Elections : ‘మా’లో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యలో మెగాస్టార్..

జీవిత మాట్లాడుతూ ఇటీవల ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశాను. ‘మా’ ఎన్నికల్లో నేను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి ఓటు వేయాలని అభ్యర్థించగా ప్రస్తుత పరిస్థితులపై ఆయన అసహనం వ్యక్తం చేశారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని, ఓటు వేసేందుకు రానని ఆయన తేల్చి చెప్పారని జీవిత అన్నారు. తనను ఇకపై ఓటు అడగొద్దని కూడా ఎన్టీఆర్ చెప్పినట్లుగా జీవిత తెలిపింది.

ఇక ప్రస్తుత పరిస్థితుల పై మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చెప్పినట్లు నిజంగా మా పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు. ప్రకాష్ రాజ్ పై విష్ణు ప్యానెల్ తెలుగు వాడు కాదని చేసిన వ్యాఖ్యలకి ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అంటూ విష్ణుని ప్రశ్నించారు. ఎలక్షన్స్ అయ్యేవరకు సినీ పరిశ్రమలో ఈ వేడి తగ్గేట్లు లేదు.