Mahesh Babu : నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది : మహేష్

తాజాగా ఈ బ్యూటిఫుల్ క‌పుల్ మ‌హేశ్‌ బాబు-న‌మ్ర‌త శిరోద్కర్‌లు ఒక మ్యాగజైన్‌ కోసం ఇచ్చిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూ

Mahesh Babu : నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది : మహేష్

Mahesh

Mahesh Babu :  సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. మహేష్ వైఫ్ తన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేష్ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ నమ్రత ఎక్కువగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ సినిమాలో కలిసి నటించి అప్పుడే ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆ సినిమా టైంలో ఫోటోషూట్ చేయించారు. కానీ తర్వాత అధికారికంగా వీరిద్దరూ కలిసి ఫోటోషూట్ చేయించలేదు.

Telangana Jagruthi Bathukamma Song: అల్లిపూల వెన్నెల.. జాగృతి బతుకమ్మ సాంగ్.. రిలీజ్‌కు రెడీ!

తాజాగా ఈ బ్యూటిఫుల్ క‌పుల్ మ‌హేశ్‌ బాబు-న‌మ్ర‌త శిరోద్కర్‌లు ఒక మ్యాగజైన్‌ కోసం ఇచ్చిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు. ఇప్పుడు ఈ విషయాన్ని మహేశ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుగా చాలా ఆనందంగా ఉంది. నా సూపర్‌ ఉమెన్‌తో కలిసి హలో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోలు ఇవి. తనతో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని పోస్ట్ చేశారు. హలో మ్యాగజైన్‌ కోసం ఈ కపుల్ పలు రకాల ఫొటోలకి ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హలో మ్యాగజైన్‌ కవర్‌ పేజీకి ఫొటోషూట్‌ ఇచ్చిన తొలి సెలబ్రెటీ కపుల్‌గా మహేశ్‌-నమ్రతలు నిలిచారు.