Telangana Jagruthi Bathukamma Song: అల్లిపూల వెన్నెల.. జాగృతి బతుకమ్మ సాంగ్.. రిలీజ్‌కు రెడీ!

తెలంగాణ జాగృతి సంస్థ నిర్మాణంలో.. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బతుకుమ్మ ప్రత్యేక గీతం.. మంగళవారం రిలీజ్ కాబోతోంది.

Telangana Jagruthi Bathukamma Song: అల్లిపూల వెన్నెల.. జాగృతి బతుకమ్మ సాంగ్.. రిలీజ్‌కు రెడీ!

Batukamma

Updated On : October 4, 2021 / 9:16 PM IST

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. వర్సెటైల్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వం.. నేషనల్ అవార్డ్ విన్నర్ బృంద కొరియోగ్రఫీ.. తెలంగాణ ఉద్యమ గీతాలతో పేరు పొందిన మిట్టపల్లి సురేందర్ సాహిత్యం.. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ జాగృతి నిర్మాణం. ఇంతటి ప్రత్యేకమైన కాంబోలో రూపుదిద్దుకున్న బతుకుమ్మ ప్రత్యేక గీతం.. మంగళవారం రిలీజ్ కాబోతోంది.

కొన్నేళ్లుగా.. బతుకమ్మ పండగ వస్తోందంటే.. ప్రత్యేక పాటల విడుదలతో.. తెలంగాణలో సందడి నెలకొంటోంది. ఒకప్పటి పాటలకంటే.. ట్రెండీగా వస్తున్న బతుకమ్మ గీతాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. గతంలో.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చిన బతుకమ్మ పాటలూ.. మంచి ఆదరణ పొందాయి.

ఇప్పుడు.. సినీ లెజెండరీల ఆధ్వర్యంలో రూపొందిన తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట.. రిలీజ్‌కు ముందే.. అందరి అటెన్షన్ సొంతం చేసుకుంది. తెలంగాణ సంప్రదాయ ప్రతీక అయిన బతుకమ్మ విశిష్టతను.. మిట్టపల్లి సాహిత్యం ఎలా చెప్పనుంది.. రెహమాన్ స్వరాలు ఎలా ఉండబోతున్నాయి.. గౌతమ్ మీనన్ టేకింగ్.. బృంద వేయించిన స్టెప్పులు ఎలా ఉండనున్నాయన్న బజ్.. ఇప్పటికే క్రియేట్ అయ్యింది. ఇంతటి మోస్ట్ అవెయిటెడ్ బతుకమ్మ సాంగ్.. మంగళవారం సాయంత్రం రిలీజ్ కానుంది.