MAA Elections : సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన ‘మా’ ఎన్నికల అధికారి

మా' ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ వేడి ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్ళింది. మంచు విష్ణు ఎలక్షన్ లో మోసాలకు పాల్పడుతున్నాడంటూ 'మా' ఎన్నికల అధికారికి

MAA Elections : సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన ‘మా’ ఎన్నికల అధికారి

Maa Ele

MAA Elections :  తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఇరు ప్యానళ్లు వాళ్ల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇండస్ట్రీ పెద్దల్ని కలుస్తూ ఓట్ల కోసం అభిప్రాయపడుతున్నారు. వరుస ప్రెస్ మీట్స్ పెడుతూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ వేడి ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్ళింది. మంచు విష్ణు ఎలక్షన్ లో మోసాలకు పాల్పడుతున్నాడంటూ ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యదు చేశారు. విష్ణు కూడా ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేశారు.

అలాగే మంచు విష్ణు బ్యాలెట్‌ పేపర్‌ విధానం ద్వారానే ‘మా’ ఎన్నికలు జరిపించాలని కోరుతూ మా ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ప్రకాష్ రాజ్ బ్యాలెట్ ని వ్యతిరేకిస్తున్నారు. బ్యాలెట్ ద్వారా అయితే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ మీడియాతో మాట్లాడారు.

Rajeev Kanakala : నన్ను రాళ్లతో చెప్పులతో కొడతారు ఆడవాళ్లు : రాజీవ్ కనకాల

కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లామని సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ పోలింగ్‌ జరుగుతుందని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగాలని విష్ణు, ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుపాలని ప్రకాశ్‌రాజ్‌ కోరారు. ఇద్దరి ప్రతిపాదనలను సినీ పెద్దల వద్దకు తీసుకెళ్లామని, క్రమశిక్షణ కమిటీకి కూడా తెలిపామని చెప్పారు. వాళ్లంతా కూడా బ్యాలెట్‌కే మొగ్గు చూపారు. అందువల్ల బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.