Rajeev Kanakala : నన్ను రాళ్లతో చెప్పులతో కొడతారు ఆడవాళ్లు : రాజీవ్ కనకాల

ముందు విలన్ పాత్ర అని చెబితే రాజీవ్ ఒప్పుకున్నాడు. కానీ 'లవ్‌ స్టోరీ' కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్ కనకాల

Rajeev Kanakala : నన్ను రాళ్లతో చెప్పులతో కొడతారు ఆడవాళ్లు : రాజీవ్ కనకాల

Rajeev

Rajeev Kanakala ;  రాజీవ్ కనకాల సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. తనకు ఏ పాత్ర వచ్చినా ఆ పాత్రలో విలీనం అయి మంచి పరఁఫార్మెన్స్ ఇస్తాడు. మామూలు జీవితంలో తను చాలా మంచి వ్యక్తి. కానీ తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు ఎన్నో విలన్ పాత్రలు కూడా చేశారు. ఒక నటుడిని ఆయన చేసిన పాత్రలు చూసి ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు అంటే అంతకంటే గొప్ప ప్రశంస మరొకటి లేదు అని రాజీవ్ అంటున్నారు.

ఇటీవల వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు రాజీవ్. అయితే ఈ పాత్ర అన్ని సినిమాల్లో లాగా ఉండే ప్రతినాయకుడి పాత్రలాంటిది కాదు. ఇందులో సొంత అన్న కూతుర్నే ఎనిమిదేళ్ల‌ వయసులో లైంగికంగా వేధించే క్రూరమైన బాబాయ్ పాత్ర ఇది. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి సాధారణంగా ఎలాంటి నటుడు కూడా అంత తొందరగా ముందుకు రారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా రాజీవ్ కనకాలతో ఈ పాత్రను చేయించడానికి చాలా కష్టపడ్డాడు.

MAA Elections : ఇండస్ర్టీని విడగొట్టాలని చూస్తే ఊరుకోను : మంచు విష్ణు

ముందు విలన్ పాత్ర అని చెబితే రాజీవ్ ఒప్పుకున్నాడు. కానీ ‘లవ్‌ స్టోరీ’ కథ చెప్పిన తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్ కనకాల. శేఖర్ కమ్ముల కథ చెప్పిన తర్వాత ఈ పాత్ర చేయాలంటే భయమేసింది, కనీసం బాబాయ్ కాకుండా మేనమామగా అయినా ఈ క్యారెక్టర్ మార్చాలని శేఖర్ కమ్ములని అడిగానని, కానీ సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలు చూపించాలని శేఖర్ కమ్ముల చెప్పేసరికి ఇష్టం లేకున్నా ఒప్పుకున్నాను అని అన్నారు రాజీవ్.

అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నటుడిగా తనకు ప్రశంసలు చాలా వస్తున్నాయి. అంతే కాక ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి అని అన్నారు. బి, సి సెంటర్లలో నేను గానీ థియేటర్‌కి వెళ్తే ఖచ్చితంగా ఆడవాళ్లు రాళ్లు, చెప్పులతో కొడతారని రాజీవ్ కనకాల తెలిపారు. దీన్ని బట్టి ప్రేక్షకులు తన పాత్రను ఎంతగా అసహ్యించుకుంటున్నారో అర్థమైంది. ఒక నటుడికి ఇంతకంటే గొప్ప ప్రశంస ఇంకేం కావాలి అని రాజీవ్ అభిప్రాయపడ్డారు.