Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?
బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గత రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరల్లో బుధవారం మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harishth Thanniru
- Published On : November 22, 2023 / 07:48 AM IST
Gold Price Today
Today Gold and Silver Rate : బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గత రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరల్లో బుధవారం మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై రూ. 380 పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. రెండు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. బుధవారం మాత్రం కిలో వెండిపై రూ. 400 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,850కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,020 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,170.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,850 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020 కు చేరింది.
– చెన్నైలో గోల్డ్ ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 280 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.62,510కు చేరింది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,400కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,400. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.76,400 కు చేరింది. బెంగళూరులో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రూ.75,000 వద్ద కొనసాగుతుంది.
