Zomato asks customers: హోటల్ కు వెళ్లి మనకు నచ్చిన ఆహార పదార్థం ఆర్డర్ ఇస్తాం. ఆ సమయంలో “నూనె తక్కువగా వేయి, బాగా స్పైసీగా ఉండాలి” వంటి సూచనలు చేస్తుంటాం. ప్రస్తుత కాలంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ ఇవ్వడం బాగా పెరిగిపోయింది. దీంతో ఆర్డర్ చేసిన పదార్థాలు ఎలా ఉండాలి? అన్న విషయాన్ని తెలిపేందుకు కూడా ఫుడ్ డెలివరీ యాప్ లు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
‘కుకింగ్ సూచనలు’ కింద యూజర్లు ఆయా వివరాలు రాయాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా యూజర్ల సూచనల ప్రకారం వంటకాలను తయారు చేస్తుంటాయి. అలా తయారు చేస్తేనే తమ యూజర్లు మంచి రేటింగ్ ఇస్తారని, ఆర్డర్లు పెరుగుతాయని ఆయా హోటల్/రెస్టారెంట్లు భావిస్తుంటాయి.
అయితే, జొమాటోలో ‘కుకింగ్ సూచనలు’ కింద యూజర్లు చాలా మంది ఓ ప్రత్యేక సూచన రాస్తున్నారట. ఈ సూచన రాయకూడదంటూ జొమాటో తాజాగా ట్వీట్ చేసింది. ‘‘సోదరా ఆహార పదార్థాన్ని సరిగ్గా చేయి’’ అని యూజర్లు చాలా మంది ‘కుకింగ్ సూచనలు’ కింద రాస్తున్నారని చెప్పింది. ఇకపై అలా రాయడం మానేయాలని కోరింది. జొమాటో చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆహార పదార్థాన్ని సరిగ్గా వండాలని రాయడం కూడా ‘కుకింగ్ సూచనలు’ కిందికే వస్తుందని, తమ స్వేచ్ఛను హరించవద్దని కొందరు పేర్కొన్నారు.
guys please stop writing “bhaiya accha banana” as cooking instructions ?♂️
— zomato (@zomato) December 22, 2022
Ram Setu: రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం షాకింగ్ ఆన్సర్