Hindu woman in Pakistan: పాకిస్థాన్‌లో హిందూ మహిళను దారుణాతి దారుణంగా చంపిన వైనం

పాకిస్థాన్‌లో హిందూ మహిళపై అతి దారుణ ఘటనకు పాల్పడ్డారు కొందరు. సింజోరోలో 40 ఏళ్ల హిందూ మహిళ తల నరికి, ఆమె ప్రైవేటు భాగాలను కోసేశారని, ఆమె చర్మాన్ని కూడా ఒలిచేశారని పాక్ లోని మొట్టమొదటి హిందూ కమినిటీకి చెందిన మహిళా సెనేటర్ కృష్ణ కుమారి చెప్పారు. బాధిత మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారని వివరించారు.

Hindu woman in Pakistan

Hindu woman in Pakistan: పాకిస్థాన్‌లో హిందూ మహిళపై అతి దారుణ ఘటనకు పాల్పడ్డారు కొందరు. సింజోరోలో 40 ఏళ్ల హిందూ మహిళ తల నరికి, ఆమె ప్రైవేటు భాగాలను కోసేశారని, ఆమె చర్మాన్ని కూడా ఒలిచేశారని పాక్ లోని మొట్టమొదటి హిందూ కమినిటీకి చెందిన మహిళా సెనేటర్ కృష్ణ కుమారి చెప్పారు. బాధిత మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారని వివరించారు.

‘‘దయా భెల్.. 40 ఏళ్ల వితంతు. ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. దయా భెల్ మృతదేహం ఘోరస్థితిలో కనపడింది. ఆమె తలపై చర్మాన్ని కూడా ఒలిచేశారు. నేను ఆమె గ్రామాన్ని సందర్శించాను. పోలీసు బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి’’ అని సెనేటర్ కృష్ణ కుమారి చెప్పారు.

దయా భెల్ మృతదేహం పొలాల్లో కనపడిందని, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ మహిళ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. ఆ మహిళ మృతదేహానికి పోర్టుమార్టం కూడా పూర్తయిందని, తదుపరి విచారణ జరపుతున్నామని చెప్పారు. పాకిస్థాన్ లో హిందూ మహిళలపై పదే పదే దారుణాలు జరుగుతున్నాయి.

AAI Recruitment : కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ