World Cup 2023: పాకిస్థాన్ కు ఇంకా సెమీస్ ఛాన్స్ ఉందా..?

పాకిస్థాన్ సెమీస్ చాన్స్ పై మాజీ కెప్టెన్ వసీం అక్రం కామెడీగా స్పందించారు. అదోక్కటే మార్గమని ఆయన ఒక టీవీలో సరదాగా అన్నారు.

How will Pakistan qualify for semifinals after New Zealand win against Sri Lanka

ODI World Cup-2023: వన్డే వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ దాదాపు వైదొలగింది. శ్రీలంకపై భారీ విజయంతో న్యూజిలాండ్ సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. దీంతో పాకిస్థాన్ కు అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. ఇంగ్లండ్ తో జరిగే తమ చివరి మ్యాచ్ లో ఏదైనా మహా అద్భుతం జరిగితే తప్ప పాకిస్థాన్ అవకాశం లేదు. ఎలాగైనా సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టి టీమిండియాతో పాకిస్థాన్ ఆడుతుందని ఆశ పడ్డ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. 15న ముంబైలో జరిగే మొదటి సైమీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆడతాయి.

పాకిస్థాన్ కు ఇంకా ఛాన్స్ ఉందా?
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరడానికి సమీకరణాలు ఉన్నాయి కానీ అవి సాకారం కావాలంటే అద్భుతాలు జరగాలి. ఎందుకంటే చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించినా చాలదు. ఏకంగా 275 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడిస్తేనే పాకిస్థాన్ కు సెమీస్ అవకాశం ఉంటుంది. డిఫెండింగ్ చాంపియన్ పై అంతటి భారీ విజయం సాధ్యమా? ఇంగ్లండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150 స్కోరు చేస్తే.. పాకిస్థాన్ 3.4 ఓవర్లలోనే ఛేజ్ చేయాలి. ఒకవేళ పాకిస్థాన్ 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఇవన్నీ జరగడం అసాధ్యం కాబట్టి పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాల్లేవు.

వసీం అక్రం సరదా కామెంట్
పాకిస్థాన్ సెమీస్ చాన్స్ మాజీ కెప్టెన్ వసీం అక్రం కామెడీగా స్పందించారు. ఇంగ్లండ్ జట్టును బ్యాటింగ్ కు దిగకుండా డ్రెస్సింగ్ రూములో పెట్టి తాళం వేస్తే సరి అంటూ సరదా కామెంట్ చేశారు. పాకిస్థాన్ స్పోర్ట్స్ చానల్ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా బెటర్ ఐడియా ఉండే ఇవ్వొచ్చుగా అని అక్రంను మిస్సా అడగ్గా.. ముందుగా ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాలి. తర్వాత ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూముకు తాళం వేయాలి అంటూ సలహాయిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు