సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2వ ర్యాంకర్.. ఈ IAS లైఫ్ ఎలా ఉందంటే? టీనా డాబీతో విడాకుల తర్వాత, డాక్టర్ మెహరీన్‌తో కొత్త జీవితం..

అతార్ ఆమిర్ ఖాన్ తన బ్యాచ్ UPSC టాపర్ (AIR 1) అయిన టీనా డాబీని 2018లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇది ఒక సంచలనం.

IAS Athar Aamir-Dr Mehreen Qazi

ప్రముఖ ఐఏఎస్ అధికారి అతార్ ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2015 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 2వ ర్యాంక్ సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, తన వ్యక్తిగత జీవితం ద్వారా కూడా తరచుగా మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయనకు ఓ పిల్లాడు జన్మించాడు.

టీనా డాబీ అనే మహిళతో వివాహం, విడాకులు, ఆ తర్వాత డాక్టర్ మెహరీన్‌తో కొత్త లైఫ్ జర్నీ ప్రారంభించారు. అతార్ ఆమిర్ ఖాన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆయన భార్య నేపథ్యాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. అతార్, మెహరీన్ దంపతులకే తాజాగా ఒక కొడుకు జన్మించాడు.

టీనా డాబీతో వివాహం

అతార్ ఆమిర్ ఖాన్ తన బ్యాచ్ UPSC టాపర్ (AIR 1) అయిన టీనా డాబీని 2018లో వివాహం చేసుకున్నారు. శిక్షణ సమయంలో వారి మధ్య చిగురించింది ఆ ప్రేమకథ. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇది ఒక సంచలనం. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ జంట.. దురదృష్టవశాత్తు 2021లో పరస్పర అంగీకారంతో విడిపోయారు.

డాక్టర్ మెహరీన్ ఖాజీతో వివాహం

టీనా డాబీతో విడిపోయిన తర్వాత, అతార్ ఆమిర్ ఖాన్ జీవితంలోకి డాక్టర్ మెహరీన్ ఖాజీ (Dr. Mehreen Qazi) ప్రవేశించారు. 2022లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వైద్యురాలిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మెహరీన్ ఖాజీకి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఎవరు ఈ డాక్టర్ మెహరీన్ ఖాజీ?

మెహరీన్ ఖాజీ కేవలం ఒక సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు, వైద్య రంగంలో విశేషమైన అనుభవం, ఉన్నత విద్యా నేపథ్యం ఉన్న ఒక విజయవంతమైన ప్రొఫెషనల్. కశ్మీర్‌కు చెందిన ఆమె, తన అందం, స్టైల్‌తో పాటు తన అకడమిక్ సక్సెస్‌తో కూడా అందరినీ ఆకట్టుకున్నారు.

ఆమె విద్యా అర్హతలు, అనుభవం:

  • MD (Doctor of Medicine): ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి.
  • PG డిప్లొమా (ప్రసూతి & గైనకాలజీ): లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి.
  • PG డిప్లొమా (క్లినికల్ కాస్మటాలజీ): యూకే నుంచి.
  • ఫెలోషిప్ (ఎస్తటిక్ మెడిసిన్): డెన్మార్క్ నుంచి.
  • పని అనుభవం: ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పనిచేశారు.
  • ఆమెకు యూకేలో ప్రాక్టీస్ చేయడానికి వైద్య లైసెన్స్ కూడా ఉంది. ఇంటర్నల్ మెడిసిన్‌లో బోర్డు సర్టిఫైడ్ అయ్యారు.

తండ్రి అయిన అతార్ ఆమిర్ ఖాన్

అతార్ – మెహరీన్ దంపతుల జీవితంలోకి ఒక కొత్త అతిథి అడుగుపెట్టాడు. వారికి ఒక అబ్బాయి జన్మించాడు. ఈ సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “అల్లాహ్ మాకు ఒక అబ్బాయిని వరంగా ఇచ్చాడు” అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఈ జంట ‘ఇహాన్ ఆమిర్ ఖాన్’ అని నామకరణం చేశారు.