IND vs AFG : అఫ్గాన్‌తో ఏకైక టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్.. ముగిసిన రెండో రోజు ఆట
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో (IND vs AFG ) భారత్ పట్టు బిగిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- June 7, 2026 / 05:24 PM IST
IND vs AFG only test day 2 stumps Afghanistan trail by 451 runs
IND vs AFG : ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. రహమత్ షా (43 నాటౌట్; 81 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు అఫ్గాన్ ఇంకా 451 పరుగుల దూరంలో ఉంది.
అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 564/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (100; 165 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126; 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు చేశారు. సాయి సుదర్శన్ (81; 104 బంతుల్లో 13 ఫోర్లు), రిషబ్ పంత్ (81; 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్ ;68 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ ) అర్థశతకాలు బాదారు. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ సలీం సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. జియావుర్ రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ లు చెరో వికెట్ తీశారు.
Stumps on Day 2️⃣
A fantastic bowling effort led by debutant Manav Suthar’s 3️⃣ wickets 👏
We will begin Day 3 with #TeamIndia ahead by 451 runs 💪
Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/BOIhdoFz8W
— BCCI (@BCCI) June 7, 2026
ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గాన్ రెండో రోజు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయింది. భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. అరంగ్రేట ఆటగాడు మానత్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు.
