Indian Railways: రైల్వే శాఖ సంచలనం.. ఇక నుంచి సూట్ కేసులు, బస్తాలకు బస్తాలు రైల్లో మోసుకెళ్లడానికి చెల్లదు.. బ్యాగ్ వెయిట్..

ఇక్కడ లగేజ్‌ను తూకం వేసి, అది పరిమితిలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్లాట్‌ఫాంలకు తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తారని ఎన్సీఆర్‌ ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్ మేనేజర్‌ (DCM) హిమాంశు శుక్లా తెలిపారు.

Indian Railways

Indian Railways: ప్రయాణికుల లగేజ్‌ విషయంలో కఠిన నియమాలను అమలు చేయడానికి భారతీయ రైల్వే సిద్ధవుతోంది. ఇవి ఎయిర్ ట్రావెల్‌లో అమలు చేసే విధానాల్లానే ఉంటాయి.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు ముఖ్య రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ల ద్వారా లగేజ్‌ను తూకం వేయాలి. అనుమతించిన పరిమితిని మించితే లేదా లగేజ్‌ తక్కువ బరువు ఉన్నప్పటికీ అది సైజులో పెద్దగా ఉంటే అదనపు చార్జీలు లేదా శిక్షలు పడతాయి.

రైల్వే రీడెవలప్‌మెంట్‌ స్టేషన్లలో ప్రీమియం సింగిల్ బ్రాండ్ ఔట్‌లెట్లను తీసుకొస్తోంది. వీటిలో అప్పారెల్‌, ఫుట్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌, ట్రావెల్ గేర్ వంటి వస్తువులు అమ్ముతారు. దీని వల్ల ప్రయాణికులకు సౌకర్యం మెరుగుపడుతుంది, రైల్వేకి ఆదాయం కూడా వస్తుంది, స్టేషన్లు ఎయిర్‌పోర్ట్‌ వాతావరణంలా ఉంటాయని ఒక అధికారి తెలిపారు.

ట్రైన్‌ క్లాస్‌ ప్రకారం లగేజ్ పరిమితి భిన్నంగా ఉంటుంది. ఏసీ ఫస్ట్‌ క్లాస్‌లో 70 కిలోలు, ఏసీ టూ టియర్‌లో 50 కీలోలు, ఏసీ త్రీ టియర్‌–స్లీపర్‌ క్లాస్‌లో 40 కిలోలు, జనరల్ క్లాస్‌లో 35 కిలోలకు మాత్రమే అనుమతిస్తారు. బరువు తక్కువైనా ఎక్కువ సైజు ఉండే బ్యాగులు స్పేస్‌ను ఆక్రమిస్తే శిక్షలు పడతాయి.

మొదట ఎన్సీఆర్‌ జోన్‌లోని ప్రధాన స్టేషన్లలో.. 

ఈ నియమాల ప్రాథమిక అమలు ఎన్సీఆర్‌ జోన్‌లోని ప్రధాన స్టేషన్లలో జరుగుతుంది. వీటిలో ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌, ప్రయాగ్‌రాజ్‌ ఛెవొకి, సుబేదార్గంజ్‌, కాన్పూర్‌ సెంట్రల్‌, మిర్జాపూర్‌, టుండ్లా, అలీగఢ్‌ జంక్షన్‌, గోవింద్‌పురి, ఎటావా ఉన్నాయి.

ఇక్కడ లగేజ్‌ను తూకం వేసి, అది పరిమితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్లాట్‌ఫాంలకు ప్రవేశం ఇస్తారని ఎన్సీఆర్‌ ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్ మేనేజర్‌ (DCM) హిమాంశు శుక్లా తెలిపారు. (Indian Railways)

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ కింద రూ.960 కోట్ల పెట్టుబడితో ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌ రీడెవలప్ అవుతోంది. ఇది 9 అంతస్తుల నిర్మాణంతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన మోడల్ రైల్వే హబ్‌గా రూపుదిద్దుకుంటుంది.

ఆ టికెట్‌ “బోర్డింగ్ పాస్‌”లా పనిచేస్తుంది..

సదుపాయాల్లో విశాల వెయిటింగ్ లౌంజ్‌లు, హైస్పీడ్ వైఫై, సోలార్ ఎనర్జీ సిస్టమ్స్‌, రైన్వాటర్ హార్వెస్టింగ్‌, ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్ మెషీన్స్‌, డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేస్ ఉంటాయి. 2026 డిసెంబర్‌ నుంచి టర్మినల్ ఏరియాలో ప్రవేశం కేవలం సరైన ట్రైన్‌ టికెట్‌ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది.

ఆ టికెట్‌ “బోర్డింగ్ పాస్‌”లా పనిచేస్తుంది. నాన్ ట్రావెలర్స్‌కి ప్లాట్‌ఫాం టికెట్ తప్పనిసరి, అది “విజిటర్ పాస్‌” అవుతుంది. కుంభ, మహా కుంభమేళాల సమయంలో భారీగా వచ్చే ఫుట్‌ఫాల్‌ దృష్ట్యా ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకోసం స్టేషన్‌లో సెవెన్‌ కోర్ సర్వీస్‌ (CS) కాన్సెప్ట్‌ అమలు చేస్తారు.

కొత్త నిర్మాణం దివ్యాంగులకు అనుకూలంగా, సాంస్కృతిక సమన్వయం కలిగి, సోలార్ ఎనర్జీ బేస్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌గా రూపుదిద్దుకుంటుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌ స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌కు మోడల్‌గా మారుతుంది.