New Zealand PM: వచ్చే నెల రాజీనామా చేస్తాను: న్యూజిలాండ్ ప్రధాని సంచలన ప్రకటన

న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. 2017 నుంచి ఆర్డెర్న్ న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగుతున్నారు.

New Zealand PM: న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. 2017 నుంచి ఆర్డెర్న్ న్యూజిలాండ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. అనంతరం, మూడేళ్ల తర్వాత (2020లో) జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించి, మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.

అయితే, కొన్ని నెలలుగా ఆమె ప్రభ తగ్గిపోయింది. ఈ విషయం ఒపీనియన్ పోల్స్ లో తేలింది. మరోసారి లేబర్ పార్టీ నాయకురాలిగా కొనసాగే సామర్థ్యం తనకు ఉందని ఇంతకుముందు వరకు భావించానని, అయితే, ఇప్పుడు అలా అనిపించడం లేదని చెప్పారు. ప్రధాన మంత్రిగా ఎటువంటి బాధ్యతలు ఉంటాయో తనకు తెలుసని, అయితే, వాటికి న్యాయం చేసే శక్తి తనను లేదని భావిస్తున్నానని తెలిపారు.

తాను రాజీనామా చేయడం వెనుక ఏ రాజకీయ కోణమూ లేదని, ప్రత్యేకమైన కారణమూ లేదని, తాను ఓ మనిషిని కాబట్టి రాజీనామా చేస్తున్నానని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. న్యూజిలాండ్ లో తదుపరి సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరు 14న జరుగుతాయని, అప్పటి వరకు తాను ఎంపీగా కొనసాగుతానని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని భావించి తాను రాజీనామా చేస్తున్నట్లు ఎవరూ అనుకోవద్దని, వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ప్రధానిగా తన రాజీనామా వచ్చే నెల 7 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడి కోసం ఈ నెల 22న ఎన్నిక జరుగుతుందని చెప్పారు. తన రాజీనామా వెనుక ఎటువంటి రహస్యమూ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కొత్త వాళ్లు కావాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

Kanti Velugu: తెలంగాణలో నేటి నుంచి కంటి వెలుగు పరీక్షల నిర్వహణ

ట్రెండింగ్ వార్తలు