‘తలైవి’ – అమ్మ గెటప్‌లో అదరగొట్టిన కంగన!

  • Publish Date - December 5, 2020 / 01:17 PM IST

Thalaivi stills – Kangana Ranaut: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయ పాత్ర పోషిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. శనివారం (డిసెంబర్ 5) జయలలిత నాల్గవ వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ‘తలైవి’ మూవీ నుండి న్యూ పోస్టర్లు రిలీజ్ చేశారు.



జయ క్యారెక్టర్‌లో కంగన గెటప్ ఆకట్టుకుంటోంది. జయలలితగా కంగన అద్భుతంగా సెట్ అయిందంటూ సినీ ప్రియులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా జయలలితకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేసింది కంగన.


‘‘జయ అమ్మ వర్థంతి సందర్భంగా ‘తలైవి’ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్. మా టీమ్‌కు, అలాగే సినిమాను అద్భుతంగా తెరకెక్కించడానికి ఎంతో కష్టపడుతున్న మా లీడర్ విజయ్ సర్‌కు ధన్యవాదాలు. మరో వారం రోజుల్లో ‘తలైవి’ షూటింగ్ పూర్తి కాబోతోంది’’ అని తెలిపింది కంగన. ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా : విశాల్ విఠల్, నిర్మాణం : విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్.